Home » Entertainment » Priyanka Chopra To Be Gets Mother Promotion
Entertainment

Priyanka Chopra : త‌ల్లి అయిన ప్రియాంక చోప్రా.. స‌ర్‌ప్రైజ్ న్యూస్‌తో పెద్ద షాక్ ఇచ్చిందిగా…!

Authored By
Sam C
The Telugu News | Published on: January 22, 2022, 10:30 am
Advertisement

Priyanka Chopra : బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ప్రియాంక చోప్రా మెల్లమెల్ల‌గా హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్క‌డ కూడా స్టార్ స్టేట‌స్ అందుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ నిక్ జోనాస్ అనే సింగ‌ర్‌ని పెళ్లి చేసుకొని అక్క‌డే సెటిల్ అయింది. అయితే ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా తాజ‌గా స‌ర్‌ప్రైజ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి అయినట్లు సరోగసీ ద్వారా బిడ్డ పుట్టినట్లు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది ఈ అందాల సుందరి.

Advertisement

ప్రియంక చోప్రా, నిక్ లు డిసెంబర్ 2018లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి రెండేళ్లు దాటింది. అయితే ఈ దంపతులిద్దరూ ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో పిల్లల గురించి ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదు. అలానే ప్రియాంక కూడా బేబి బంప్‌తో క‌నిపించ‌లేదు. మ‌రి ఎలా త‌ల్లి అయింద‌నే అనుమానం అంద‌రిలో ఉండ‌గా, ఆమె సరోగసీ ద్వారా తల్లి అయింది ఈ విషయాన్ని నిక్ జోనాస్ , ప్రియాంక చోప్రా లు తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిజేశారు.

priyanka chopra to be gets mother promotion

Advertisement

Priyanka Chopra : స‌రోగ‌సీ ద్వారా పేరెంట్స్ ప్ర‌మోష‌న్..

సరోగసి విధానం ద్వారా ఓ బిడ్డని పొందినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ ప్రత్యేక సందర్భంలో మాకు ప్రైవసీ కల్పించి మేము ఫ్యామిలీపై ఫోకస్ పెట్టేందుకు సహకరించగలరు. అందరికి ధన్యవాదాలు’ అంటూ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రియాంక చోప్రా ఈ స్వీట్ న్యూస్ చెప్పడంతో ఆమె కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పూజా హెగ్డే, హ్యూమా క్యురేషి లాంటి సెలెబ్రిటీలు ప్రియాంక చోప్రాకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అభిమానులంతా సర్ ప్రైజ్ కి గురవుతూనే పీసీని విష్ చేస్తున్నారు.

Priyanka Chopra

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి