Home » Entertainment » Priyanka Jawalkar Reacts Rumours On Cricketer
Entertainment

Priyanka Jawalkar : క్రికెట‌ర్‌తో ప్రియాంక జ‌వాల్క‌ర్ ల‌వ్.. క్లారిటీ ఇచ్చేసిందిగా..

Authored By
Sam C
The Telugu News | Published on: June 27, 2022, 8:30 pm
Advertisement

Priyanka Jawalkar : టాక్సీవాలా చిత్రంలో విజ‌య్ దేవ‌రకొండ స‌ర‌స‌న న‌టించి మెప్పించిన అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జ‌వాల్క‌ర్. ఈ అమ్మ‌డు మరాఠి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇక హైదరాబాద్ లోనే తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న ప్రియాంక ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా కూడా వెళ్ళింది. అక్కడ ఎనిమిది నెలల పాటు ఆమె ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం కూడా చేసింది. మంచి చదువుతోపాటు ఉద్యోగంలో కొనసాగుతున్న ఆమె హఠాత్తుగా మళ్ళీ చిత్ర పరిశ్రమ వైపు యూటర్న్ తీసుకుంది. మొదట ఆమె కలవరమాయే మదిలో అనే సినిమాతో 2017లో వెండితెరకు పరిచయం అయింది.

Advertisement

ఈ సినిమా హిట్ కాక‌పోయిన న‌టిగా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఆ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ బ్యూటీకి మొదట్లో కొన్ని చిన్న సినిమాల్లో మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ తొందరపడకుండా కంటెంట్ ఉన్న ప్రాజెక్టులను సెల‌క్ట్ చేసుకుంది. ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం , తిమ్మ‌రుసు చిత్రాల్లో ప్రియాంక జ‌వాల్క‌ర్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన సంగ‌తి విదిత‌మే. ఆమెకు సంబంధించిన ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో ఓ అబ్బాయితో ప్రియాంక జ‌వాల్క‌ర్ మాట్లాడుతూ క‌నిపించింది.

priyanka jawalkar reacts rumours on cricketer

Advertisement

Priyanka Jawalkar : అవ‌న్నీ రూమ‌ర్స్..

ఆ అబ్బాయి.. ఇండియ‌న్ క్రికెట‌ర్ వెంక‌టేష్ అయ్యర్ అని.. మ‌రో క్రికెట‌ర్‌, సినీ స్టార్ మ‌ధ్య ప్రేమాయ‌ణం కొన‌సాగుతుందంటూ వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేయ‌టం ప్రారంభ‌మ‌య్యాయి. ఎట్ట‌కేల‌కు ఈ వార్త‌ల‌పై స్పందించింది ప్రియాంక‌. మరోసారి ఆ ఫొటోను షేర్‌ చేస్తూ.. ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి ఫొటో మాకు ఓ పనిలో సాయం చేయడానికి వచ్చాడు. బాయ్‌ఫ్రెండ్‌ అంటూ వార్తలు వస్తుండటంతో ఏంటి సంగతని మా అమ్మ అడుగుతోంది. దయచేసి అలాంటివి రాయడం ఇంక ఆపేయండి అని సూచించింది. గ‌తంలో కూడా చాలా మంది హీరోయిన్స్‌కి సంబంధించి ఇలాంటి రూమ‌ర్స్ హ‌ల్‌చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి