Home » Entertainment » Priyanka Singh Parents Comments On Her Dressing Style
Entertainment

Priyanka Singh : ప్రియాంక సింగ్ మొత్తం మారిపోయింది.. ఆమె పేరెంట్స్ షాకింగ్ కామెంట్స్..

Authored By
mallesh
The Telugu News | Updated on: October 25, 2021 10:26 pm
Advertisement

Priyanka Singh : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ ప్రజెంట్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఏడో వారంలో ప్రియ ఎలిమినేట్ అయింది. కాగా, ప్రియ ఎలిమినేట్ అవబోతుందనే తెలియడంతో ప్రియాంక కన్నీటి పర్యంతమైంది. మానస్ ఎంత ఓదార్చినప్పటికీ ప్రియాంక ఏడుస్తూనే ఉంది. ఈ సంగతులు అలా ఉంచితే.. ప్రియాంక సింగ్ గురించి ఆమె పేరెంట్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంట్లోనే ఉన్నపుడు ప్రియాంక అలా ఉండేది కాదని, ఇప్పుడు మొత్తం మారిందని చెప్పారు.బిగ్ బాస్ సీజన్ ఫైవ్’‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాయితేజ అనే ట్రాన్స్‌జెండర్..

Advertisement

priyanka singh parents comments on her dressing style

‘అతడు కాగా అతడు ఆమెగా మారాడు. ఆపరేషన్ చేయించుకుని ప్రియాంక సింగ్ గా మారానని హౌజ్‌లో ఉన్నపుడు తెలిపింది ప్రియాంక సింగ్. ఇక హౌజ్‌లో ప్రియాంక సింగ్ మానస్‌తో లవ్ ట్రాక్ నడిపిస్తున్నప్పటికీ ఆమెపైన ఎటువంటి కంప్లయింట్స్ అయితే లేవు. ఇకపోతే ప్రియాంక అలియాస్ సాయితేజ గురించి ఆమె తల్లిదండ్రులు షాకింగ్ విషయాలు చెప్పారు. అయితే, బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నపుడు ప్రియాంక బర్త్ డే సందర్భంగా తల్లిదండ్రులు పంపిన వీడియో మెసేజ్ చూసి ప్రియాంక ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ప్రియాంక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎలా అయినా ఓకేనని ప్రియాంక తల్లిదండ్రులు పేర్కొన్నారు. తాజాగా ఇంటర్వ్యూలో ప్రియాంక తల్లి మాట్లాడుతూ తామెప్పుడూ బిగ్ బాస్ చూడలేదని, కానీ, ఇప్పుడు తేజు కోసం అందరూ షో చూస్తున్నామని, తేజ గేమ్ బాగా ఆడాలని కోరుకుంటున్నామని చెప్పింది.

Advertisement

Priyanka Singh : ప్రియాంకకు ఓట్లు వేయాలని అభ్యర్థించిన ఆమె తల్లిదండ్రులు..

priyanka singh parents comments on her dressing style

తేజ అలియాస్ ప్రియాంక సింగ్ ఇంట్లో ఉన్నపుడు అలా లేదని ఇప్పుడు మొత్తం మారిపోయిందని, చీరలు కడుతుందని, ప్యాంట్, షర్ట్స్ వేసుకుంటుందని పేర్కొంది. విన్నర్ అవ్వాలని ఆకాంక్షించింది. ప్రియాంక తండ్రి డీబీ సింగ్ మాట్లాడుతూ నాగార్జున పేరు చెప్పినపుడు తాను విన్నానని, ఆయన తన గురించి మాట్లాడటం బాగుందని, సాయి(ప్రియాంక సింగ్) బిగ్ బాస్‌కు వెళ్లడం గర్వంగా ఉందన్నాడు. సాయి ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నానని ప్రియాంక సింగ్ తండ్రి డీబీ సింగ్ భావోద్వేగంతో తెలిపాడు. ‘బిగ్ బాస్’ పేరుతో పాటు శ్రీకాకుళం జిల్లా పేరు నిలబెట్టాలని కోరుతూ తన సాయికి అందరూ ఓట్లు వేయాలని డీబీ సింగ్ అభ్యర్థించాడు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి