Home » Entertainment » Production Company Yuvasudha Trolls Them In The Case Of Ntr30
Entertainment

NTR 30 : నిర్మాణ సంస్థకు షాక్..ఇప్పుడే ఇలా అయితే సినిమా మొదలయ్యాక ఎలా..?

Authored By
vamana sai
The Telugu News | Published on: May 17, 2022, 11:00 am
Advertisement

NTR 30 : తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఆశించిన స్థాయిలో ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూపించారు. రాధే శ్యామ్ సినిమా అప్‌డేట్స్ రాలేదనే కోపంతో యూవీ క్రియెషన్స్‌ను సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఎలా ఆడుకున్నారో అందరికీ తెలిసిందే. ఆ విధంగా మైత్రీ వారిని బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. పుష్ప సినిమాకు సంబంధించిన వరుస అప్‌డేట్స్ ఇవ్వలేదని మైత్రీ వారికి, సుకుమార్‌కు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ట్రోల్ చేశారు.

Advertisement

ఇప్పుడు ఇదే క్రమంలో ఎన్టీఆర్ 30 విషయంలో ఆయన అభిమానులు నిర్మాణ సంస్థ యువసుధ వారిని ట్రోల్ చేస్తున్నారు. యువసుధ బ్యానర్ ని సాలీడ్‌గా టార్గెట్ చేస్తూ ఒక ట్యాగ్ ని ఎన్టీఆర్ ఫాన్స్ ఇప్పుడు తెగ ట్రెండ్ చేస్తున్నారు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను యువసుధ క్రియేషన్స్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా సహ నిర్మాతగా ఉన్నాడు. అయితే, మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఆ ఈరోజున ఎన్టీఆర్ 30కి సంబంధించిన ఫస్ట్ లుక్ కానీ టైటిల్ కానీ రిలీజ్ చేస్తారని ఎంతో నమ్మకంగా నందమూరి అభిమానులతో పాటుగా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

Production company Yuvasudha trolls them in the case of NTR30

Advertisement

NTR 30 : అభిమానులు మేకర్స్‌ను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.

కానీ, తారక్ పుట్టిన రోజుకి సమయం దగ్గర పడుతున్నా కూడా ప్రొడ్యూసర్స్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ రావడం లేదు. దీంతో హర్ట్ అయిన ఎన్టీఆర్ ఫాన్స్, యువసుధ నిర్మాణ సంస్థని ట్వీట్స్ తో తెగ ఆడేసుకుంటున్నారు. చెప్పాలంటే తారక్ అభిమానులు చాలా ఓపికగానే ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ తన నెక్స్ట్ రెండు సినిమాలను ప్రకటించాడు. ఇప్పటికే శంకర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చాడు. 30 శాతం షూటింగ్ కూడా పూర్తైంది. కానీ, ఇంకా తారక్ సినిమా మాత్రం సెట్స్ మీదకు రాలేదు. అందుకే, అభిమానులు మేకర్స్‌ను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి