Pulsar Bike Jhansi Dance video viral
Pulsar Bike Jhansi : శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో చాలా మంది టాలెంట్ బయటకు వస్తున్న విషయం తెలిసిందే. అలా ఈవెంట్స్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ చేసే ఝాన్సీ పాపులర్ అయింది. ప్రైవేట్ సాంగ్ కి ఝాన్సీ వేసిన మాస్ స్టెప్స్ పిచ్చి రేపాయి. షోలో ఉన్న కమెడియన్స్ తో పాటు ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. డాన్స్ లో ఝాన్సీ యూనిక్ స్టైల్ జనాలకు కనెక్ట్ అయ్యింది. ఆ దెబ్బతో ఝాన్సీ మరింత పాపులర్ అయ్యారు. డ్యాన్స్ పూర్తయ్యాక ఝాన్సీ తనను తాను గాజువాక డిపో కండక్టర్ గా పరిచయం చేసుకున్నారు. ఇది ప్రేక్షకులను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.
తనకు డాన్స్ అంటే ఇష్టమని అయితే బంధువులతో పాటు కొందరు ఈ వృత్తిని ఎంచుకున్నందుకు అవమానించారని, మా పరువు తీస్తున్నావని తిట్టిపోశారని ఝాన్సీ తెలియజేసింది. రమేష్ మాస్టర్ అనే వ్యక్తి ఝాన్సీని ప్రోత్సహించారు. ఝాన్సీతో పాటు ఓ టీమ్ ని ఏర్పాటు చేసి ప్రోగ్రామ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఝాన్సీ డాన్స్ వీడియోలు యూట్యూబ్ లో లక్షలు మంది చూశేవారు. ఆ విధంగా ఆమె సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యారు. ప్రస్తుతం ఝాన్సీ టెలివిజన్ షోస్ లో కూడా కనిపిస్తున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా కూడా ఝాన్సీ అలరించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఈమె మంగ్లీ పాడిన పాటకు తనదైన స్టైల్‌లో డ్యాన్స్ వేసింది. ఇందులో ఆమె స్టెప్పులు కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి.
Pulsar Bike Jhansi Dance video viral
ఎంత గ్రేస్‌తో డ్యాన్స్ చేస్తున్నావు అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఝాన్సీ డ్యాన్స్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో ‘పల్సర్ బైక్’ సాంగ్‌తో స్టేజ్‌కి షేక్ ఆడించిన ఝాన్సీ.. తన మల్టీటాలెంట్‌తో హాట్ టాపిక్ అవుతోంది. ఓ వైపు కండక్టర్‌గా మరోవైపు డాన్సర్‌గా బతుకుసాగిస్తున్న ఝాన్సీ.. గత 11 ఏళ్లుగా ఏపీఎస్ఆర్టీసీ గాజువాక డిపోలో ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూ.. డాన్స్ పెర్ఫామెన్స్‌లు చేస్తూ ఉంటుంది. ఓ వైపు పేదరికం.. మరో వైపు ఇంటి బాధ్యతలతో ఉద్యోగాన్ని చేస్తూనే తనకి ఎంతో ఇష్టమైన డాన్స్‌ని చేస్తూ వస్తోంది. ఉత్తరాంధ్రలో డాన్సర్ ఝాన్సీ చాలామంది పరిచయమే కాగా.. గతంలో టీవీ షోలు కూడా చేసింది.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.