Home » Entertainment » Punch Prasad Health Condition Is Critical
Entertainment

Punch Prasad : పంచ్ ప్ర‌సాద్‌కి ఏమైంది.. న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్నాడా..!

Authored By
Sam C
The Telugu News | Published on: November 19, 2022, 10:20 am
Advertisement

Punch Prasad : జ‌బ‌ర్ధ‌స్త్ వేదిక‌గా మంచి కామెడీ పంచే న‌టుల‌లో పంచ్ ప్ర‌సాద్ ఒక‌రు. ఆయ‌న ఎప్పుడు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో న‌వ్విస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయ‌న ఆరోగ్య పరిస్థితి అస్స‌లు బాగోలేదు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ ఆరోగ్యంఇప్పుడు మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని కూడా ప్రసాద్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలియ జేయ‌గా, ప్రసాద్ భార్య ఈ వీడియోను అతనికి తెలియకుండా తీయడంతో అతని ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందని ప్రేక్షకులకు అర్ద‌మైంది.

Advertisement

ఇక పంచ్ ప్రసాద్ భార్య చెప్పిన దాని ప్రకారం.. ఓరోజు షూటింగ్ తర్వాత ఫీవర్‌గా ఉందని ఇంటికొచ్చిన ప్రసాద్.. నడుము నొప్పితో చాలా ఇబ్బంది ప‌డ్డాడు. డాక్టర్స్ కూడా ఫస్ట్ ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదని, టెస్టులు చేస్తే నడుము వెనక వైపు కుడికాలి వరకు చీము పట్టేసినట్లు తెలిసింది’ అని వారు చెప్పుకొచ్చిన‌ట్టు ఆమె చెప్పుకొచ్చింది. ప్రసాదన్నకు ఇష్టం లేకపోయినా ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తున్నానని, అందరి ఆశీస్సులుండాలని, ఆయనకు సపోర్ట్‌ ఇవ్వాలని నూక‌రాజు వీడియోలో చెప్పుకొచ్చాడు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ ఆరోగ్యం క్షీణించింది అని తెలిసి చాలా మంది బాధ‌ప‌డుతున్నారు.

punch prasad health condition is critical

Advertisement

Punch Prasad : పాపం ఏం జ‌రిగింది…!

రెండు కిడ్నీలు పాలై పోవడంతో రోజు విడిచి రోజు డయాలసిస్ చేయించుకుంటున్నాడు పంచ్ ప్రసాద్. అయితే ఇప్పుడు కదల్లేని స్థితిలో వీల్ చైర్‌కి పరిమితం కావ‌డం చూసి అంద‌రు చ‌లించిపోతున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. పంచ్ ప్ర‌సాద్.. తెర వెనుక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నా.. అందరినీ నవ్విస్తూ.. తన బాధను మరిచిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్టులకు జీవితాలను అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ స్టేజీపై నవ్వులు పూయించిన వారు ప్రస్తుతం వెండితెరపై వరుస అవకాశాలతో ముందుకు సాగుతున్నారు. ఇక మరికొందరు ఇప్పటికీ జబర్దస్త్ కామెడీ షోలోనే కొనసాగుతూ అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి