Mahesh Babu : పూరీ జగన్నాథ్, మహేష్ బాబు.. ఈ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి, బిజినెస్‌మెస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా వస్తుందని కొందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని అది జరిగేలా కనిపించడం లేదు. అయితే రీసెంట్‌గా మహేష్ బర్త్ డేని పురస్కరించుకొని.. మహేష్ బ్లాక్ బస్టర్ సినిమాలైనా పోకిరి, ఒక్కడు సినిమాలను మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేసి ఆ రోజంతా సూపర్ స్టార్ మ్యానియా అంటే ఏంటో చూపించారు. పోకిరి సినిమాకు ముందు నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా కలిసి మొత్తం 400 స్పెషల్ షోలను ప్రదర్శించారు.ఇప్పటి వరకు ఇది ఎవ్వరికి సాధ్యం అవ్వలేదు.
అయితే పోకిరి చుట్టూ ఇంత సందడి జరిగిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నా ఈ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాత్రం పోకిరి స్పెషల్ షో గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ట్విట్టర్ వేదికగా నైనా మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపకపోవటం ఆశ్చర్యకరం.. వీరి కాంబినేషన్ లో జనగణమన అనే మూవీ కూడా అనౌన్స్ చేశారు. కానీ అధికారికంగా ప్రకటించలేదు.. దీనికి ప్రధాన కారణం డైరెక్టర్ కి హీరోకి మధ్య గ్యాప్ వచ్చిందని విభేదాల వల్లే వీరు కాస్త దూరంగా ఉంటున్నారని అంటున్నారు..
ఈ విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయని అంటుండగా, ఈ క్రమంలో పూరీ పోకిరి గురించి మాట్లాడలేదని కొందరు చెబుతున్నారు. మరి కొందరు పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాలో అందుబాటులో లేని క్రమంలో ఎలాంటి కామెంట్ చేయలేదని అంటున్నారు. ఏది ఏమైన ప్రస్తుతం వారిద్దరి మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కాగా, లైగర్ సినిమాతో బిజీగా ఉన్నాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ సినిమా జోరుగా ప్రమాషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
Kubera Yoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా ఖగోళంలో ఏర్పడే యోగాల వలన కొన్ని…
Smart TV Offer : 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొనాలని అనుకున్న వారికి చాలా తక్కువ ప్రైజ్ లో…
Ekadashi : వేద శాస్త్రంలో కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిధిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. అదేవిధంగా ఈ ఉత్థాన…
KTR : ఆటో డ్రైవర్ల కష్టాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు…
Chandrababu Naidu : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులు, నాయకులు కూడా చాలా సీరియస్గా పని చేస్తున్నారు. ఎవరైన…
BSNL సిమ్ కార్డ్ కోసం రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది. BSNL ఈమధ్యనే 4జి సేవలను ప్రారంభించింది. BSNL నెట్…
Us Elections 2024 : ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమైంది.…
Virat Kohli Birthday : టీమిండియా Team India మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీ …
This website uses cookies.