
Pushpa 2 : బన్నీ అరెస్ట్ వలన పుష్ప2 వసూళ్లు అంత పెరిగాయా..!
Pushpa 2 : అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప2. చిత్రంలో రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప-2 కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లో ఈ సినిమా అప్రతిహతంగా దూసుకెళుతోంది. శనివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.46.50 కోట్లు వసూలు చేసింది. దీంతో హిందీ వెర్షన్‌లో కేవలం 10 రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లో పుష్ప-2 అడుగుపెట్టింది. జవాన్, స్త్రీ2, గదర్2, పఠాన్, బాహుబలి2, యానిమల్ సినిమాలను అధిగమించి మరీ అత్యంత వేగంగా పుష్ప-2 ఈ రికార్డు నెలకొల్పింది. పది రోజుల్లో ఈ చిత్రానికి దాదాపుగా 14 మిలియన్ కి పైగా టిక్కెట్లు బుక్ మై షో యాప్ ద్వారా అమ్ముడుపోయాయని సమాచారం.
Pushpa 2 : బన్నీ అరెస్ట్ వలన పుష్ప2 వసూళ్లు అంత పెరిగాయా..!
ఫుల్ రన్ లో బాహుబలి 2 చిత్రానికి 16 మిలియన్ కి పైగా టికెట్స్ అమ్ముడుపోగా, కేజీఎఫ్ 2 చిత్రానికి 17 మిలియన్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. పుష్ప 2 రన్ ముగిసేలోపు ఈ రెండు రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.. 10 రోజులకు కలిపి 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. శుక్రవారం రూ.27.50 కోట్లు, శనివారం ఏకంగా రూ.46.50 కోట్లతో కలుపుకొని మొత్తం రూ.507.50 కోట్లు వసూలు చేసింది. ఇక బాలీవుడ్‌లో రెండవ శనివారం అత్యధిక వసూళ్లు (రూ.46.50 కోట్లు) రాబట్టిన చిత్రంగా కూడా పుష్ప-2 నిలిచింది. అంతకుముందు స్త్రీ2 మూవీ రూ. 33.80 కోట్లు, గదర్2 రూ. 31.07 కోట్లు, జవాన్ రూ. 31.07 కోట్లు, జవాన్ 30.10 కోట్లు, బాహుబలి-2 రూ.26.50 కోట్లు, ది కశ్మీర్ ఫైల్స్ రూ.24.80 కోట్లు, దంగల్ రూ.23.07 కోట్లు, పఠాన్ రూ.22.50 కోట్లు వసూలు చేయగా.. వాటన్నింటినీ పుష్ప-2 దాటేసింది.
1500 కలెక్షన్స్ ఈ సినిమా సులువుగా రాబడుతుందని అంటున్నారు. మిగిలిన ఇండస్ట్రీల సంగతి ఏమో కానీ హిందీలో మాత్రం పుష్ప 2 ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఓ హస్టారిక్ రికార్డును బద్ధలు కొట్టేందుకు పుష్ప 2 సిద్ధమైంది. అదేంటంటే. ఏడేళ్ల క్రితం హిందీలో బాహుబలి 2 రూ.511 కోట్ల నెట్ కలెక్షన్స్ సృష్టించగా.. ఇప్పుడు పుష్ప రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఆదివారం మార్నింగ్ షోకే ఈ రికార్డును పుష్ప 2 ది రూల్ అధిగమించనుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆదివారం కలెక్షన్స్ మరింత ఊపందుకునే అవకాశం ఉందని అంటున్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.