Home » Entertainment » Pushpa 2 Utter Flop Guarantee If This Continues
Entertainment

Pushpa 2 : ఇదే కంటిన్యూ అయితే పుష్ప 2 అట్టర్ ఫ్లాప్ గ్యారెంటీ ?

Authored By
Breaking News
The Telugu News | Published on: April 24, 2023, 3:00 pm
Advertisement

Pushpa 2 : 2021లో డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో సుకుమార్… అల్లు అర్జున్ కలసి చేసిన ఈ సినిమా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపు ఊపింది. స్టోరీ పరంగా డైలాగులు ఇంకా సాంగ్స్.. అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. సినిమాలో తగ్గేదేలే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా చాలా హైలైట్ అయింది. విడుదలైన అన్ని భాషల్లో రికార్డు స్థాయి వసూలు రాబట్టింది. దీంతో “పుష్ప 2” చాలా ప్రతిష్టాత్మకంగా తేరకెక్కిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ బర్తడే నాడు వేర్ ఇజ్ పుష్ప అనే స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది.

Advertisement

Pushpa 2 utter flop guarantee if this continues

ఆ వీడియో ఎంతగానో ఆకట్టుకుంది. యూట్యూబ్ లో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు విపరీతంగా పుష్ప కోసం ఎదురుచూస్తున్నారు. పుష్ప మొదటి భాగం ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా గాని హిందీలో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం “పుష్ప 2” షూటింగ్ ఒడిశా అడవులలో జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఇదే కంటిన్యూ అయితే పుష్ప అట్టర్ ఫ్లాప్ అనే టాక్ ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మేటర్ లోకి వెళ్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో 2023 వ సీజన్ లో మోస్ట్ అవైటెడ్ హిందీ సినిమాల జాబితాలో “పుష్ప 2” మొదటి స్థానంలో నిలిచింది.

Advertisement

What is there in Pushpa 2 Movie beyond KGF 2 and Baahubali 2

రెండో స్థానంలో కిలాడి అక్షయ నటిస్తున్న “హేరా ఫెరీ 3” నిలిచింది. అయితే సీరీస్ పరంగా మూడో భాగం తేరకెక్కించే హిందీ సినిమాలలో చాలా సినిమాల షూటింగ్స్ ప్రారంభంలోనే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ రీతిగానే “హేరా ఫెరీ 3” నిర్మాతల గొడవల కారణంగా… నిలిచిపోయినట్లు సమాచారం. సో దీని పరంగా.. చూసుకుంటే పుష్ప సినిమాని ఎంతో  ఆదరిస్తున్న హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని.. ప్రజెంట్ రెండో పార్ట్ తర్వాత త్రీ ఆలోచనలో మేకర్స్ ఉండటంతో ఇదే కంటిన్యూ అయితే “పుష్ప 2” బాలీవుడ్ సెంటిమెంట్ ప్రకారం అట్టర్ ఫ్లాప్ గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి