pushpa movie will be premiered in these theatres
Pushpa Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ నెల 17న అనగా శుక్రవారం థియేటర్స్‌లో సినిమా విడుదల కానుంది. ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రం తర్వాత బన్నీ చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది.. గతంలో వీరిరువురి కాంబోలో వచ్చిన ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద సత్తా చాటాయి. ఇప్పుడు ‘పుష్ప’ ఏం చేయబోతుందో చూడాలి మరి..ఇకపోతే ఈ సినిమా రిలీజ్‌కు ముందరే రూ.250 కోట్ల బిజినెస్ చేసిందనే కథనాలు మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డెఫినెట్‌గా సూపర్ హిట్ అవుతుందని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సంగతి అలా ఉంచితే..ఏపీలో బెన్ ఫిట్ షోస్ కు అనుమతి లేదని ఏపీ సర్కారు ఇటీవల చట్టం చేసింది. కాగా, తెలంగాణలో మాత్రం బెన్ ఫిట్ షో, ప్రీమియర్‌గా సినిమా వేసుకునే అవకాశం ఉంది. అలా ఈ ‘పుష్ప’ సినిమా ఫస్ట్ షో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో ఉన్న భ్రమరాంభ, మల్లికార్జున థియేటర్స్‌లో ‘పుష్ప’ ఫస్ట్ షో పడుతుందని సమాచారం. ఇటీవల విడుదలైన బాలయ్య ‘అఖండ’ పిక్చర్ ఫస్ట్ షో కూడా ఈ రెండు టాకీసుల్లోనే వేశారు.
pushpa movie will be premiered in these theatres
ఇకపోతే ‘పుష్ప’ ఫిల్మ్ అఫీషియల్ ప్రీమియర్ షో కూడా ఇదే అని అంటున్నారు. ప్రీమియర్ షో చూసేందుకుగాను సుకుమార్‌తో పాటు అల్లు అర్జున్, సినిమా యూనిట్ సభ్యులు కొందరు వస్తారని పేర్కొంటున్నారు థియేటర్స్ నిర్వాహకులు. మొత్తంగా బన్నీ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన నటించగా, విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటించారు.
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
This website uses cookies.