Radhe Shyam First Collections : అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రాధే శ్యామ్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం అభిమానులని కాస్త బాధిస్తుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ ప్రీమియర్స్ పరంగా రాధే శ్యామ్ చిత్రానికి సాలీడ్ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ తెలుపుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 7000 వేలకు పైగా స్క్రీన్లలో ఈ మూవీ విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ అంచనాలను అందుకుందా లేదా అనే విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తుంది.
350 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 1000 కోట్లను కలెక్ట్ చేసే దిశగా పరుగులు తీస్తుంది. తొలి రోజు మంచి టాక్ తో రాధే శ్యామ్ సినిమా అన్ని సినిమాల కంటే ముందంజలో ఉంది. ప్రభాస్‌కి ఉన్న డిమాండ్ దృష్ట్యా విడుదలకు ముందుగానే ఆన్ లైన్ టికెట్స్ బాగా అమ్ముడయ్యాయి. యూఎస్ ప్రీమియర్ షోస్ ద్వారా 891K డాలర్స్ వచ్చాయని సమాచారం. అదేవిధంగా హిందీలో కూడా బెటర్‌గా పర్ఫామ్ చేసిన ఈ సినిమా 5 నుంచి 6 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు 30 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు తెలుస్తుంది.ఒక్క హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 6.5 కోట్ల మార్కును క్రాస్ చేయడం,
ఆంధ్రాలో కొన్ని చోట్ల హైర్స్ యాడ్ కావడం ఈ సినిమాకు కాస్త కలిసొచ్చిందనేది ట్రేడ్ పండితుల మాట. రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే కథను కూడా రచించారు. భూఫన్ కుమార్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 350 కోట్ల రూపాయలతో దీనికి నిర్మించారు. తమన్ బ్యాక్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. డాక్టర్ పాత్రలో పూజా హెగ్డే, జ్యోతిష్యుడి పాత్రలో ప్రభాస్ అదరగొట్టారు.ఈ అద్భుతమైన ప్రేమ కావ్యంలో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికుడి పాత్రలో ప్రభాస్ కనిపించగా, పూజా హెగ్డే ప్రేరణ రోల్ పోషించింది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ, ప్రభాస్ నటన ఈ సినిమాలో హైలైట్ అయ్యాయి.
TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
This website uses cookies.