Home » Entertainment » Rajamouli To Give Update For Mahesh Babu Movie
Entertainment

Rajamouli – Mahesh Babu Movie : రాజమౌళి, మహేశ్ కాంబో మూవీ ఫస్ట్ అప్ డేట్ రాబోతోంది.. త్రివిక్రమ్ మూవీ సంగతేంటి?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: August 4, 2023, 12:00 pm
Advertisement

Rajamouli – Mahesh Babu Movie : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. ప్రపంచ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది రాజమౌళి, మహేశ్ సినిమా కోసం. అవును.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి తీయబోయే సినిమా గురించి తెలుసుకోవడం ప్రపంచమే ఎదురు చూస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ఏకంగా ప్రపంచ దిగ్గజ దర్శకుల జాబితాలో చేరారు. ప్రస్తుతం ఆయన మహేశ్ బాబుతో ప్రపంచ యాత్రికుడి స్టోరీతో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. మహేశ్ బాబు ప్రస్తుతానికి టాలీవుడ్ స్టార్ మాత్రమే. కానీ.. ఈ సినిమా విడుదలైతే ఆయన కూడా గ్లోబల్ స్టార్ల జాబితాలో చేరుతారు.

Advertisement

అయితే.. ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. మహేశ్ బాబుకు అది 28వ సినిమా. అది పూర్తయితేనే రాజమౌళి సినిమాకు డేట్స్ కేటాయించగలరు. అది ఎస్ఎస్ఎంబీ29 ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా కంటే కూడా రాజమౌళితో చేసే సినిమా మీదే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే అది పాన్ గ్లోబల్ మూవీ. ప్రపంచమంతా ఆసక్తిగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తోంది. అది ఒక అడ్వెంచర్ మూవీ. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగుతుంది కథనం.అయితే.. మహేశ్ బాబు బర్త్ డే త్వరలో రాబోతోంది. ఆగస్టు 9న మహేశ్ బర్త్ డే కావడంతో ఆయన బర్త్ డే సందర్భంగా రాజమౌళి సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఒకరకంగా అది మహేశ్ బాబు అభిమానులకు పండగే అని చెప్పుకోవాలి.మహేశ్ బర్త్ డేకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని రాజమౌళి ఆలోచిస్తున్నారట. నిజానికి గుంటూరు కారం సినిమా షూటింగ్ తర్వాత వచ్చే సంవత్సరం మహేశ్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఇంకా ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి వర్క్స్ కూడా ప్రారంభం కాలేదు.

rajamouli-to-give-update-for-mahesh-babu-movie

Advertisement

Rajamouli – Mahesh Babu Movie : మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ అప్ డేట్

అందుకే ఎటువంటి అప్ డేట్ ఇవ్వాలా అని రాజమౌళి తెగ ఆలోచిస్తున్నారట. ఒకవేళ రాజమౌళి ఎలాంటి అప్ డేట్ ఇచ్చినా.. ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న గుంటూరు కారం సినిమా పరిస్థితి ఏంటి. ఆ సినిమాను జనాలు పట్టించుకుంటారా? అసలు ఆ సినిమాపై అభిమానులకు ఉన్న ఆసక్తి కూడా పోతుంది కదా అంటూ అభిమానులు చర్చించుకుంటన్నారు. చూద్దాం మరి.. రాజమౌళి ఎలాంటి అప్ డేట్ విడుదల చేస్తారో?

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి