Home » Entertainment » Rajashekar Is Back On To The Track
Entertainment

Rajashekar : రాజశేఖర్ మళ్ళీ ట్రాక్ ఎక్కాడు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సర్‌ప్రైజ్ ..!

Authored By
vamana sai
The Telugu News | Published on: February 6, 2021, 3:30 pm
Advertisement

Rajashekar : రాజశేఖర్.. మళ్ళీ ట్రాక్ ఎక్కాడు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. టాలీవుడ్ లో తన 92 వ సినిమాను లేటెస్టుగా
ప్రకటించారు ఈ యాంగ్రీ మ్యాన్ . కిరణ్‌ కొండమడుగల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, ఓటిటి లో గత ఏడాది విడుదలై ప్రసంశలు అందుకున్న
గతం సినిమా నిర్మాతలు రాజశేఖర్ ప్రాజెక్ట్ కి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మిక లతో పాటు సృజన్‌, హర్ష, భార్గవ్
ఈ చిత్రాన్ని ‌ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా తన పుట్టినరోజు సందర్భంగా 91 వ సినిమాగా శేఖర్ అనే సినిమాను అనౌన్స్ చేసారు ఈ యాంగ్రీ మ్యాన్ .
ఇప్పుడేమో 92 వ సినిమాను ట్రాక్ లో పెడుతున్నారు.

Advertisement

rajashekar-is-back-on-to-the-track

దీనితో రాజశేఖర్ మంచి ఊపు మీద ఉన్నాడని టాలీవుడ్ అంతా టాక్ వినిపిస్తోంది. వరుసపెట్టి సినిమాలను ప్రకటిస్తుండడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక 92 వ సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చి రాగానే మూవీ ప్రచారాన్నిమొదలెట్టేసారు నిర్మాతలు. తాజాగా చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ రాజశేఖర్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ పై మందుగ్లాసు, వాటితో పాటే కళ్ళద్దాలు, పక్కనే గన్ , ఆ పక్కనే బుల్లెట్స్ , మరోపక్క సిగార్ కనిపిస్తున్నాయి.

Advertisement

Rajashekar : రాజశేఖర్ …మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా

మొత్తంగా ఈ పోస్టర్ చూస్తుంటే యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారనిఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. థ్రిల్లింగ్ కథనం తో యాక్షన్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ ఏడాదిలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గరుడ వేగా తో మంచి హిట్ అందుకున్న రాజశేఖర్ వరుస సినిమాలను ప్రకటిస్తూ అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నారు.ఇక గరుడ వేగ, కల్కీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రాజశేఖర్ మళ్ళీ మరో రెండు సినిమాలతో రావడాని సిద్దం అవుతున్నాడు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి