Home » Entertainment » Rajeev Kanakala As Judge In Jabardasth Show
Entertainment

Rajeev Kanakala : జబర్దస్త్ షోలోకి సుమ భర్త.. రెచ్చిపోయిన రాజీవ్ కనకాల

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 22, 2022, 6:30 pm
Advertisement

బుల్లితెర అనేది రాజీవ్ కనకాలకు కొత్తేమీ కాదు. ఎన్నో షోలను ఒంటి చేత్తో నడిపించేశాడు రాజీవ్ కనకాల. అయితే ఈ మధ్య మాత్రం రాజీవ్ కనకాల బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడు. అలా అని వెండితెరపై బిజీగా ఉన్నాడనీ కాదు. అసలు రాజీవ్ కనకాల ఎక్కువగా వార్తల్లో ఉండటం లేదు. అవకాశాలు కూడా ఎక్కువగా వస్తున్నట్టు కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక్క సీన్‌‌లోనే కనిపించాడు. సోషల్ మీడియాలోనూ ఎక్కువ యాక్టివ్‌గా ఏమీ ఉండడు. ఇక మొన్నామధ్య చేసిన షో కూడా ఫ్లాప్ అయింది.

Advertisement

Rajeev Kanakala as Judge In Jabardasth Show

ఈటీవీ ప్లస్‌లో రెచ్చిపోదాం బ్రదర్ అనే షోను స్టార్ట్ చేశారు. అందులో రాజీవ్ కనకాల కనిపించాడు. ఆ షోను కూడా గ్రాండ్‌గానే ప్రారంభించారు. సుమను తీసుకొచ్చారు. రాజీవ్ కనకాల నాన రచ్చ చేశాడు. సుమను ఆ షోలో ఎత్తుకున్నాడు. తమ మధ్య ఉన్న ప్రేమ, బంధాలను చూపించారు. అయితే కొన్ని రోజులు ఆ షో బాగానే రన్ అయింది. కానీ ఇప్పుడు షట్టర్ క్లోజ్ అయింది. ఆ షోను ఆపేశారు. ఎందుకు ఆపేశారో తెలీదు. మధ్యలోనే రాజీవ్ కనకాల వెళ్లిపోయాడు. అలా మొత్తానికి బుల్లితెరపై రాజీవ్ కనకాల సరిగ్గా మెరవలేకపోతోన్నాడు.

Advertisement

ఇక ఇప్పుడు రాజీవ్ కనకాల జబర్దస్త్ షోకు వచ్చాడు. అసలే రోజా వెళ్లిపోయింది. ఆ స్థానాన్ని ఇంద్రజ భర్తీ చేసేస్తోంది. మరో వైపు మనో వెళ్లిపోయాడు. చూస్తుంటే ఇక పూర్తిగా మనో ఈ షోకు రాకపోవచ్చు. ఎందుకంటే స్టార్ మాలో సింగింగ్ షో రాబోతోంది. అందులో మనో న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నాడు. అందుకోసమే కామెడీ షోకు ఇక స్వస్తి చెప్పినట్టు కనిపిస్తోంది. అందుకే రెండో జడ్జ్ కోసం మల్లెమాల టీం బాగానే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రాజీవ్ కనకాల జబర్దస్త్ షోకు జడ్జ్‌గా వచ్చాడు.

పూర్తి స్థాయి జడ్జ్‌గా ఉంటాడా? లేడా? అన్నది తెలియడం లేదు.కానీ ఈ ఎపిసోడ్ ప్రోమోలో మాత్రం రాజీవ్ కనకాల బాగానే ఎంజాయ్ చేశాడు. తెగ నవ్వుతూ తన ప్రపంచాన్ని మరిచిపోయినట్టున్నాడు. అంతే కాకుండా ఓ స్కిట్‌లో నటించాడు కూడా. అజర్ టీంలో రాజీవ్ కనిపించాడు. ఇంత బతకు బతికి ఇంటి వెనకాల చావడం అంటే ఏంటే తెలుసా? అని అజర్ అంటే.. ఇదిగో ఇప్పుడు చూస్తున్నా అదే అని రాజీవ్ కనకాల సెటైర్ వేస్తాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి