Home » Entertainment » Rajinikanth Daughter Aishwarya To Get Married Second Time
Entertainment

Rajinikanth : తండ్రితో తన భర్త ధనుష్ గురించి ‘ఆ మ్యాటర్’ చెప్పేసిన ఐశ్వర్య — వెంటనే రెండో పెళ్లికి కుర్రాడిని చూసేసిన రజినీకాంత్..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 26, 2022, 8:40 pm
Advertisement

Rajinikanth : ప్రస్తుతం కోలీవుడ్ లో ఒకటే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్య రెండో పెళ్లి మ్యాటర్. రజనీ పెద్దకూతురు ఐశ్వర్య కోలీవుడ్ స్టార్ ధనుష్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లు పెళ్లి చేసుకొని 17 ఏళ్ల పాటు చాలా సంతోషంగా ఉన్నారు. ధనుష్ సినిమాల్లో హీరోగా నటించగా… ఐశ్వర్య నిర్మాణ రంగంలో ఉంది. అయితే.. వీళ్ల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వీళ్ల కాపురంలో ఎవరు చిచ్చు పెట్టారో తెలియదు కానీ.. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ధనుష్ ఎప్పటిలాగే తన సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు.

Advertisement

ఐశ్వర్య కూడా తన రంగంలో ముందుకు వెళ్తోంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు కూడా. అయినా కూడా పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. కనీసం తమ పిల్లల కోసం అయినా కలవడానికి ధనుష్ ఇష్టపడటం లేదని.. ఆయన ఒక మూర్ఖుడు అంటూ ధనుష్ గురించి ఐశ్వర్య చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే.. మనిషిని అర్థం చేసుకునే గుణం ధనుష్ లో లేదని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. లేడీస్ బాధలు అర్థం చేసుకోడు. ఎవరితో మాట్లాడినా అనుమానంతో బ్లేమ్ చేస్తాడంటూ ధనుష్ కు విడాకులు ఇచ్చే సమయంలో ఐశ్వర్య షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.

rajinikanth daughter aishwarya to get married second time

Advertisement

Rajinikanth : మనిషిని అర్థం చేసుకునే గుణం ధనుష్ లో లేదు అన్న ఐశ్వర్య

అంతే కాదు.. ధనుష్ కూడా వేరే అమ్మాయితో తిరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అలాగే.. హీరో శింబుతో ఐశ్వర్యకు ఎఫైర్ ఉంది అంటూ వార్తలు వచ్చాయి. ఇలా.. ఇద్దరి మధ్య పలు అపోహలు, అపార్థాలు చోటు చేసుకోవడం.. ఇద్దరూ విడిపోవడం జరిగింది. దీంతో ఇద్దరూ తమ దారులు చూసుకున్నారు. ఐశ్వర్య మాత్రం.. తన తండ్రి రజనీకాంత్ క్లోజ్ ఫ్రెండ్ కొడుకును రెండో పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అతడిది కూడా రెండో పెళ్లేనట. ఆయన బిజినెస్ చేస్తుంటాడని.. ఇప్పుడు ఆయన ఐశ్వర్యను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి.. ఈ వార్తలు నిజమో.. అబద్ధమో.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి