Rajinikanth : వర్మనే కాదు శ్రీదేవిని రజనీకాంత్ కూడా ప్రాణంగా ప్రేమించాడా.. ఇంటికి వెళ్లి ప్రపోజ్ చేస్తే..!
Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి టాప్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.అయితే రజనీకాంత్ .. లత అనే యువతని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చారు. ఆయన జీవితంలో కూడా ఓ లవ్ స్టోరీ ఉందట. శ్రీదేవిని చాలా ప్రేమించారట తలైవా. 1976లో తమిళ భాషలో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో.. శ్రీదేవి, రజినీకాంత్, కమల్ హాసన్‌లతో కలిసి నటించారు. ఈ సమయంలో రజినీ, శ్రీదేవి మధ్య స్నేహం ఏర్పడిందంట. అయితే రజినీ ఆమెతో ప్రేమలో పడ్డారంట.రజినీకాంత్, శ్రీదేవిల బంధం చాలా ఏళ్లుగా చెక్కుచెదరకుండా అలానే ఉంది.
శ్రీదేవి తల్లిని కూడా రజినీకాంత్ తన కుటుంబంలా గౌరవించేవాడు. సినీ పరిశ్రమలో ఇద్దరూ కలిసి ఉండటంతో రజనీ శ్రీదేవికి సన్నిహితుడిగా అన్ని విషయాల్లో సహాయం చేశాడు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాల్లో నటిస్తున్నప్పుడు రజనీ చాలాసార్లు తమ ప్రేమను వ్యక్తం చేశారంట. శ్రీదేవిని పెళ్లి చేసుకోమని రజనీ తల్లిని కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. శ్రీదేవి అంటే రజనీకి చాలా ఇష్టం. కానీ శ్రీదేవికి సూపర్ స్టార్ పట్ల అలాంటి ఫీలింగ్స్ లేవని అంటున్నారు. రజినీ, శ్రీదేవి ప్రేమ గురించి దర్శకుడు కె. బాలచందర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓ రోజు రజినీకాంత్ స్వయంగా నటి శ్రీదేవి ఇంటికి వెళ్లి పెళ్లి నిర్ణయాన్ని చెప్పాలనుకున్నారని బాలచందర్ తెలిపారు.
Rajinikanth : వర్మనే కాదు శ్రీదేవిని రజనీకాంత్ కూడా ప్రాణంగా ప్రేమించాడా.. ఇంటికి వెళ్లి ప్రపోజ్ చేస్తే..!
శ్రీదేవి గృహప్రవేశ వేడుకకు రజనీ, నేనూ వెళ్లాం. మేము అతని ఇంటికి చేరుకోగానే కరెంటు పోయింది. ఇల్లంతా చీకటిగా ఉంది. దీన్ని చెడ్డ శకునంగా తీసుకున్న రజనీకాంత్ తన పెళ్లి గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా నిరాశతో వెనుదిరిగినట్టు బాలచందర్ చెప్పుకొచ్చారు. పెళ్లి చేసుకోకపోయినా శ్రీదేవి అంటే అమితమైన గౌరవం ఉన్న రజనీకాంత్.. ఆమె చనిపోయేంత వరకు స్నేహంగా ఉండేవారంట. సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ తన పర్సనల్ నంబర్‌ను కొద్దిమందికి మాత్రమే షేర్ చేశారు. ఇందులో దర్శకుడు కె. బాలచందర్, నటుడు కమల్ హాసన్, శ్రీదేవి పేరు కూడా ఉన్నారు. రానా షూటింగ్ సమయంలో రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, శ్రీదేవి రజినీకాంత్ కోసం ఉపవాస దీక్ష కూడా చేశారట. ఇక శ్రీదేవి మరణించినప్పుడు రజనీకాంత్ తన పెళ్లి రోజు కూడా జరుపుకోలేదు.
RBI Good News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లల కోసం…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
This website uses cookies.