Rakul Preet Singh : టాలీవుడ్ లో హీరో సందీప్ కిషన్ నటించిన ‘ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్v’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. ఆ సినిమాలో ఆమె నటనకు, అందాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ ఒక్క సినిమాతో రకుల్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది. దీంతో ఆమెకు తెలుగులో వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో నటించేసింది. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి జరిగింది. అయితే ఇటీవల టాలీవుడ్లో రకుల్ కి అంతగా అవకాశాలు రావడం లేదు. ఆమె తెలుగులో చివరిగా నటించిన సినిమా కొండపొలం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన రకుల్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
ఇప్పటికే అక్కడ పలు సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకుంది. అయితే ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. అయితే రకుల్ ఎవరో స్టార్ హీరోతో కమిట్ అయిందని, ఆ కారణంగానే ఈ బ్యూటీకి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయని, మరికొందరు బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పేసిందని, మరికొందరు డ్రగ్స్ తీసుకుంటుందని ఇలా పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీటికి స్పందించిన రకుల్ ఇలాంటి ఫేక్ న్యూస్ పట్టించుకునేంత టైం నాకు లేదని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ రావాలనుకునే అమ్మాయిలకు సజెషన్ ఇచ్చింది.
రకుల్ మాట్లాడుతూ డబ్బు కోసమైతే ఇండస్ట్రీకి అసలు రావద్దు. కష్టపడే తత్వం ఉండాలి అందంగా కనిపించాలి. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. ఎలాంటి పాత్రనైనా చేయగలగాలి. మరి ముఖ్యంగా మగవాళ్ళ ఆధిపత్యాన్ని తట్టుకుని నిలబడే శక్తి ఉండాలి. సమాజం ఎంత మారుతున్న మగవాళ్ళ ఆధిపత్యానికి మాత్రం చెక్ పడడం లేదు. ఎక్కడికి వెళ్ళినా మగవాళ్ళదే పై చేయి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. నా ఇంట్లో నన్ను అలా పెంచలేదు. ఆడ మగ సమానం అంటూ పెంచారు. ఇప్పటికి నేను అదే చెప్తాను స్టార్ సెలబ్రిటీస్ కావాలంటే కొన్ని ఇబ్బందులు తప్పవు అని చెప్పుకొచ్చింది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.