Home » Entertainment » Rakul Preet Singh Un Happy About Her Marriage Questions
Entertainment

Rakul Preet Singh :పెళ్లి గురించి అడిగినందుకు లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకిన ర‌కుల్ ప్రీత్ సింగ్

Authored By
Sam C
The Telugu News | Published on: April 18, 2022, 1:30 pm
Advertisement

Rakul preet Singh : బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌ల వ‌రుస ఫోటో షూట్స్‌తో ర‌చ్చ చేస్తుంది. రకుల్ లేటెస్ట్ మూవీ రన్ వే 34. ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రకుల్ ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. రన్ వే మూవీలో రకుల్ పైలట్ తాన్యా రోల్ చేస్తున్నారు. ఈ మూవీలో అజయ్ దేవ్ గణ్, అమితాబ్ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. గ‌త కొద్ది రోజులుగా ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియాతో ముచ్చ‌టిస్తూనే సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. టాలీవుడ్‌లో వరుసగా అగ్రహీరోలందరితో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. ఇప్పుడు అక్కడ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది

Advertisement

ఈ యాపిల్ బ్యూటీ. జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్ల క్రితమే అధికారికంగా సోషల్ మీడియాలో తెలిపింది.ఇటీవల బాలీవుడ్ లో ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పెళ్లి గురించి ప్రశ్నించగా రకుల్ కొంచెం సీరియస్ గానే సమాధానమిచ్చింది రకుల్. పెళ్లి ప్రశ్నకి సమాధానమిస్తూ..‘ఇది చాలా సాధారణ విషయం. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే. అమ్మ, నాన్న, తమ్ముడు ఎలా ఉంటారో జీవిత భాగస్వామి కూడా ప్రతి మనిషికి ఉంటారు. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడటం అనవసరం. దయచేసి ఇలా ప్రతిసారి అడగొద్దు. మా బంధం గురించి ఏదైనా చెప్పాల్సి వస్తే నేనే స్వయంగా చెప్తాను. అంతే గాని ఇలా ప్రతి ఇంటర్వ్యూలోనూ తన గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు’

rakul preet singh un happy about her marriage questions

Advertisement

Rakul Preet Singh : మండిప‌డ్డ ర‌కుల్..

’ అని రకుల్ సీరియస్‌గానే మాట్లాడింది.దీంతో మీడియా కూడా రకుల్ ఇచ్చిన సమాధానంతో షాక్ అయ్యింది.రకుల్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ మూవీతో సందీప్ కిషన్ హీరోయిన్ ప్రార్థనగా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా అల్లు అర్జున్, రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ వంటి యంగ్ హీరోలందరితో సినిమాలు తీసింది. యూత్‌లో రకుల్‌కు ఫుల్‌ క్రేజ్‌ ఉండేది. 2017 నుంచి బాలీవుడ్ పైనే ఫోకస్‌ పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం రకుల్‌ ఏకంగా 5 హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జీ, అజయ్ దేవగన్ , సిద్ధార్ద్ మల్హోత్రా మల్టీస్టారర్ థ్యాంక్ గాడ్, అక్షయ్ కుమార్ తో మిషన్ సిండ్రెల్లా, ఛత్రివాలి లాంటి చిత్రాల్లో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి