ram charan advice to upasana
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించిన తెలిసిందే. ఈ సినిమాతో రామ్ చరణ్‌కి పాన్ ఇండియా క్రేజ్ దక్కింది. ఇక ఈ సినిమా తర్వాత ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం పెద్దగా అలరించలేకపోయింది. ప్రస్తుతం శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు రామ్ చరణ్ .తన 15వ చిత్రం ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు ఓ వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండనుంది.
వైజాగ్ షెడ్యూల్ ముగిసిన వెంటనే చరణ్ కొంత గ్యాప్ తీసుకోనున్నట్లు సమాచారం. అయితే చరణ్ వైజాగ్ షూట్ లో ఉండగానే భార్య ఉపాసన ఓ కోరిక బయటపెట్టారు.మండుటెండల్లో ఉపాసన కు ఎక్కడికైనా చల్లని ప్రదేశానికి చెక్కేయాలని ఉందట. ఇంస్టాగ్రామ్ లో తన మూడ్ ఉపాసన తెలియజేశారు. ఉపాసనను ఎంతగానో ప్రేమించే చరణ్ కోరికకు స్పందించారు. హాలిడేకి వెళ్లాలని నాకు కూడా ఉంది. కానీ ఏం చేయను కొన్ని రోజులు వేచి చూడక తప్పదు… అంటూ ఉపాసనను ట్యాగ్ చేశారు. ఆర్సి 15 మూవీ షూటింగ్ మధ్యలో ఉన్న నేను వెకేషన్ కి వెళ్లాలనే కోరిక ఉన్నప్పటికి ఎదురుచూడక తప్పదని ఆమెకు తెలియజేశారు .
ram charan advice to upasana
గ్యాప్ దొరకినప్పడల్లా తరచుగా చరణ్, ఉపాసన టూర్స్ కి వెళుతూ ఉంటారు. అప్పట్లో ఆఫ్రికా అడ్వెంచరస్ టూర్ కి వెళ్లారు ఈ జంట. అక్కడ క్రూరమైన మృగాల మధ్య సఫారీ చేశారు. పనిలో పనిగా ఆఫ్రికాలోని వైల్డ్ లైఫ్ ని తమ కెమెరాలో బంధించారు. వారి ఫొటోగ్రఫీ కి సంబంధించిన గ్యాలెరీ ఇంట్లో ఏర్పాటు చేసి, తమ ఫ్రెండ్స్ ముందు ప్రదర్శించారు. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుండగా, ఇందులో కియారా కథానాయికగా నటిస్తుంది. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ మూవీలో రామ్ చరణ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
This website uses cookies.