Home » Entertainment » Ram Charan Alone Two Clarity With This Blow
Entertainment

Ram Charan : రామ్ చరణ్ ఒక్కడా ఇద్దరా..? ఈ దెబ్బతో క్లారిటీ

Authored By
vamana sai
The Telugu News | Updated on: May 19, 2022 1:16 am
Advertisement

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గ్లోబల్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు – శిరీష్ కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అంతేకాదు, ఇది చరణ్ కెరీర్‌లో 15వ సినిమా కావడంతో పాటూ నిర్మాత దిల్ రాజు సంస్థకు 50 మూవీ కావడం విశేషం.

Advertisement

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, ఆర్సీ 15 సినిమాలోని కొంత భాగం 1930 కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే లీక్ అయిన చరణ్ ఫొటోస్ చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు, ఈ మూవీలో చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టుగా ఇటీవల వైజాగ్ షెడ్యూల్ నుంచి లీకైన లేటెస్ట్ ఫొటోస్ – వీడియోస్ చూస్తే కూడా క్లారిటీ వచ్చేసింది. ఒక పాత్రలో పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్, మరో పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ రోల్స్‌లో కనిపించనున్నారని ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

Ram Charan Alone Two Clarity With This Blow

Advertisement

Ram Charan :Ram Charan విలేజ్ లుక్ ది రిలీజ్ చేస్తారా లేక మోడరన్ లుక్ పోస్టర్ వదులుతారా..?

అయితే, ఇంతకముందు పంచకట్టులో చరణ్ సైకిల్ తొక్కుతున్న ఫోటో ఒకటి బయటకి రాగా, ఇందులో చరణ్ పొలిటికల్ లీడర్ లా మాత్రం కనిపించలేదు. ఓ రైతుగా కనిపించాడు. అయితే, తాజాగా ఆర్సీ 15 సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా మొదలయినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ టైటిల్ అలాగే, చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజా సమాచారం మేరకు అతి త్వరలోనే ఆర్సీ 15 ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ ని కూడా దర్శకుడు శంకర్ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. విలేజ్ లుక్ ది రిలీజ్ చేస్తారా లేక మోడరన్ లుక్ పోస్టర్ వదులుతారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. ఈ దెబ్బతో ఆర్సీ 15లో చరణ్ ఒక్కడా లేక ఇద్దరా తేలిపోతుంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి