Home » Entertainment » Ram Gopal Varma Marries Rashmi Keep An Eye On Indraja
Entertainment

Ramgopal Varma : రష్మీని రామ్ గోపాల్ వర్మ పెళ్లి చేసుకుంటాడటా.. ఇంద్రజపైనా కన్ను..?

Authored By
mallesh
The Telugu News | Published on: December 14, 2021, 5:00 pm
Advertisement

Ramgopal Varma : సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ మరో సారి వార్తల్లో కెక్కారు. ఆయన రూటే వేరు. ఎవరేమనుకున్నా పట్టించుకోరు. తనకు నచ్చింది చేసుకుంటూ పోతారు. ఈ సందర్భాల్లో ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ వాటిని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. మూవీస్ తీసుకుంటూ బిబీబిజీగా ఉంటే ఈ డైరెక్టర్.. ఉన్నట్టుండి బుల్లితెరపై కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గతంలోనూ రాం గోపాల్ వర్మ..

Advertisement

సుల్తానా, యాక్ట్రస్ జ్యోతితో చేసిన రచ్చ.. అందరికీ తెలిసిందే.. వాళ్లతో కలిసి ఫుల్‌గా ఆర్జీవీ ఎంజాయ్ చేశారు. ఆ వీడియోలు సైతం ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇంద్రజకు, ఆర్జీవీకి సంబంధించిన ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఎప్పటిలాగే తన చూపులతో ఇంద్రజను ఇరుకున పెట్టాడు ఆర్జీవీ.కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. పెళ్లాం వద్దు.. పార్టీ ముద్దు.. అనే స్పెషల్ ప్రోగ్రాం‌ను ప్లాన్ చేశారు. ఇందుకు ఆర్జీవీని స్పెషల్ గెస్ట్‌గా ఇన్వైట్ చేశారు.

Ram Gopal Varma marries Rashmi keep an eye on Indraja

Advertisement

Ramgopal Varma : వీడియో వైరల్

అనంతరం రష్మి, లాస్య, ఇంద్రజ తదితరులతో స్టెప్పులు వేయించారు. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో తాజాగా రీలీజ్ అయింది. ప్రస్తుతం అందరినీ ఇది ఆకట్టుకుంటోంది. ఇందులో మీ అందరినీ నేను పెళ్లి చేసుకోవచ్చా అంటూ అడుగుతాడు ఆర్జీవీ. దీంతో అక్కడున్న వారంతా నోళ్లు వెళ్లబెట్టారు. లాస్ట్‌కు సమంత ఐటమ్ సాంగ్స్ వస్తుండగా ఇంద్రజను తన చూపులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు రాం గోపాల్ వర్మ. దీంతో ప్రత్యేకించి రామ్ గోపాల్ వర్మ కోసమైనా ఈ ప్రోగ్రాం చూడాలని అనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. మరి వీరంతా కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారో చూడాలి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి