Ram prasad about Sudigali Sudheer and Rashmi
Sudheer – Rashmi : బుల్లితెరపై రష్మీ సుధీర్ జోడికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. దాదాపు ఎనిమిదేళ్లు అవుతున్నా కూడా ఈ జంట ఇప్పటికీ జనాలను ఆకట్టుకుంటూనే ఉంటుంది. వారిద్దరి మధ్య ఏమీ లేదని తెలిసినా, తామిద్దరం మంచి స్నేహితులమేనని ఎన్నోసార్లు చెప్పినా కూడా జనాలు మాత్రం ఆ ఇద్దరినీ జోడిగానే చూస్తుంటారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. అని అభిమానులు అడుగుతూనే ఉంటారు. వారు మాత్రం అలాంటి కామెంట్లను ఖండిస్తూనే ఉంటారు.
అయితే తెర మీదకు వచ్చే సరికి కెమిస్ట్రీని ఓ రేంజ్‌లో పండిస్తుంటారు. రష్మీ సుధీర్ మధ్యలో ఏదో ఉన్నట్టుగా క్రియేట్ చేస్తుంటారు. వారు కూడా అంతే స్థాయిలో నటిస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే వారంప్రసారం కానున్న ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో అదిరిపోయే స్కిట్ వేసినట్టు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో సుధీర్ పెళ్లిని చెడగొట్టేందుకు గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్ ఓ రేంజ్‌లో ప్లాన్ వేశారు.
Ram prasad about Sudigali Sudheer and Rashmi
సుధీర్‌కు పెళ్లి జరిగిపోతోంటే.. దాన్ని ఆపేందుకు శ్రీను, రాం ప్రసాద్‌లు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో రష్మీని రంగంలోకి దించుతారు. రష్మీ సుధీర్ మామూలుగా మాట్లాడుకుంటూ ఉన్నా కూడా రాం ప్రసాద్ వాటిని మార్చి చెబుతుంటాడు. వాళ్లిద్దరూ చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారో.. పెళ్లి అవుతున్నందుకు ఏడ్చేస్తున్నారు.. వారిద్దరూ ఎక్కడెక్కడో తిరిగారు.. పార్టీలు పబ్‌లు అంటూ రాం ప్రసాద్ చెబుతూ ఉండగానే సుధీర్ ఉలిక్కి పడ్డాడు. మొత్తానికి స్కిట్లో భాగంగా ఇలాంటివి రాస్తారో నిజంగానే జరుగుతాయో అని చూసే ప్రేక్షకులు మాత్రం ఆ జంట రియల్ జంట అని భ్రమపడుతుంటారు.
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.