Home » Entertainment » Ramya Krishna Latest Photoshoot
Entertainment

Ramya Krishnan : ఐదు పదుల వయసులో రమ్యకృష్ణ ఈ రెచ్చిపోవడం ఏంటి.. అసలు ఈతరం భామలు ఆమె ముందు ఏం పనికొస్తారు..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: November 8, 2022, 11:00 am
Advertisement

Ramya Krishnan : లీవుడ్ లో ఎంతమంది తారలు వస్తున్నా సరే కొందరికి ఎప్పటికీ ఒకే రకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు సీనియర్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ. ఐదు పదుల వయసులో కూడా ఆమె ఇంకా సినిమాల్లో రాణిస్తూ తన ఏజ్ కి తగిన పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఈమధ్యనే వచ్చిన లైగర్ లో కూడా తన మాస్ డైలాగ్స్ తో ఆకట్టుకుంది రమ్యకృష్ణ. అయితే ఇప్పుడు ఆమె గురించి ఎందుకు అంటే.. ఇప్పుడున్న హీరోయిన్స్ కు తాను ఏమాత్రం తగ్గనంటూ ఫోటో షూట్స్ కూడా చేస్తుంది శివగామి. బ్లాక్ కలర్ శారీలో డైరక్టర్ భార్య చేస్తున్న షో అంతా ఇంతా కాదు.

Advertisement

కుర్ర హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా ఈ ఏజ్ లో కూడా తన గ్లామర్ తో అలరిస్తుంది రమ్యకృష్ణ. నిన్నటితరం అందాల తారగా అప్పటి యూత్ ని ఉర్రూతలూగించిన రమ్యకృష్ణ మరోసారి తన క్రేజీ లుక్స్ తో ఆకట్టుకున్నారు. తనకు వచ్చిన పాత్రల్లో తన మార్క్ చూపిస్తూ వస్తున్న రమ్యకృష్ణ కొన్ని సినిమాల్లో మాత్రం తన ముద్ర వేస్తూ వస్తున్నారు. సినిమాలు ఎలా ఉన్నా ట్రెండ్ కి తగినట్టుగా తనని తాను అప్డేట్ చేసుకుంటుంది రమ్యకృష్ణ. కృష్ణ వంశీ భార్యగా రమ్యకృష్ణ ఇప్పటికీ తన సత్తా చాటుతుంది.

ramya krishna latest photoshoot

Advertisement

ప్రస్తుతం భర్త డైరక్షన్ లో వస్తున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తుంది రమ్యకృష్ణ. ఈ సినిమాలో ఆమె పాత్ర సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. లైగర్ లో ఆమె పాత్ర హీరోయిన్ పాత్రని సైతం డామినేట్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఎలాంటి పాత్ర వచ్చినా ఛాలెంజింగ్ గా చేస్తూ వస్తున్నారు రమ్యకృష్ణ. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించిన రమ్యకృష్ణ ఇప్పటి స్టార్స్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఏజ్ గ్యాప్ తప్ప రమ్యకృష్ణలో ఆ కసి అంతే ఉందని చెప్పొచ్చు. ఇదే కాదు మరో ఇద్దరి స్టార్ సినిమాల్లో కూడా రమ్యకృష్ణ నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలతో మరోసారి రమ్యకృష్ణ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారనుంది.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి