Home » Entertainment » Rangasthalam Fame Mahesh Again Came In Hyper Aadi Team
Entertainment

Hyper Aadi : చివరకు మళ్లీ జబర్దస్తే దిక్కైంది.. ‘రంగస్థలం’ మహేష్ పరువుదీసిన హైపర్ ఆది

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 24, 2021, 9:50 pm
Advertisement

Hyper Aadi జబర్దస్త్ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఎన్నెన్నో కలలతో ఇండస్ట్రీకి వచ్చిన వారికి జబర్దస్త్ నీడనిచ్చింది. అక్కున చేర్చుకుంది. వారు కూడా తమ తమ ప్రతిభతో క్రేజ్ను సొంతం చేసుకున్నారు. అలా జబర్దస్త్ వేదిక మీద మహేష్ ఫేమస్ అయ్యాడు. జబర్దస్త్ మహేష్ అనే గుర్తింపును తెచ్చుకున్నాడు. అలాంటి మహేష్ సినిమాల్లోనూ రాణించాడు. కమెడియన్‌, కారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ ఇలా అన్ని రకాలుగా మెప్పించాడు.

Advertisement

Rangasthalam Fame Mahesh Again Came In Hyper Aadi Team

జబర్దస్త్ షోకి మహేష్ రీ ఎంట్రీ Hyper Aadi

రంగస్థలం సినిమాతో మరింత స్థాయికి ఎదిగాడు. జబర్దస్త్ మహేష్ కాస్తా.. రంగస్థలం మహేష్‌గా మారిపోయాడు. ఇక చివరకు హీరోగానూ ప్రయత్నించాడు. నేను నాగార్జున అంటూ ఓ చిత్రంలో హీరోగా నటించాడు. కానీ అది వచ్చింది. పోయింది.. కూడా ఎవ్వరికీ తెలీదు. అయితే ఇప్పుడు మహేష్‌కు అంతగా మూవీ ఆఫర్లు లేనట్టు కనిపిస్తోంది. మళ్లీ జబర్దస్త్ పంచన చేరాడు. ఆది స్కిట్‌లో మెరుపులా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆది అయితే మహేష్‌ను దారుణంగా ఆడుకున్నాడు.

Advertisement

Rangasthalam Fame Mahesh Again Came In Hyper Aadi Team

నేను నాగార్జున సినిమాను ఎంత మంది చూశారు అని ఆది అడగడం.. నేను నాగార్జున అంటూ మహేష్ బదులివ్వడం అదిరిపోయింది. ఇక సినిమా చేసే సమయంలో ఏమని చెప్పారు అంటే.. ఈ చిత్రం తరువాత ఎవ్వరికీ దొరకవు అని అన్నారట. కానీ ఇప్పుడు మాత్రం తనకు అవకాశాలు దొరకడం లేదట.. అలా మొత్తానికి మహేష్ పరిస్థితి ఆది తన స్కిట్ రూపంలో చెప్పినట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా మళ్లీ జబర్దస్త్ షోలో మహేష్ పంచులు కనిపించనున్నాయి.

Advertisement

Rangasthalam Fame Mahesh Again Came In Hyper Aadi Team

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి