Home » Entertainment » Rashi Khanna Romans With Vijay Devarakonda
Entertainment

Rashi Khanna : బెడ్‌రూంలో ఆ హీరోతో రాశి ఖ‌న్నా స‌ర‌సాలు.. ద‌ద్ద‌రిల్లిపోవ‌ల్సిందేనా?

Authored By
Sam C
The Telugu News | Published on: September 21, 2022, 8:00 pm
Advertisement

Rashi Khanna : తెలుగు సినిమా పరిశ్ర‌మ‌లో స్లో అండ్ స్ట‌డీగా దూసుకుపోతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న ముద్దుగుమ్మ రాశీ ఖ‌న్నా. ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఆ త‌ర్వాత కూడా డిఫ‌రెంట్ పాత్ర‌లు పోషించి అల‌రించింది. ఇటీవ‌ల పక్కా కమర్షియల్ చిత్రంలో న‌టించ‌గా, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుందని అనుకుంటే ఈ సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ భామ నటించిన మరో లేటెస్ట్ సినిమా థాంక్యూ. నాగచైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా పాజిటివ్ బజ్‌తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది.

Advertisement

Rashi Khanna : మరో సారి రొమాన్స్…

సినిమా అవకాశాలు కాస్త త‌క్కువ అయిన నేపథ్యంలో రాశి ఖ‌న్నా లిప్‌లాక్ సీన్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్‌కి కూడా సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. “వరల్డ్ ఫేమస్ లవర్” అనే సినిమాలో విజయ్ తో బెడ్ పై అమ్మడు చేసిన హంగామా మాములుగా లేదు. వీరిద్ద‌రికి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి ఇక మరోసారి అదే కాంబోలో తెర పైకి రాబోతున్నట్లు ఫిలిం ఇండస్ట్రీ నుంచి సమాచారం అందుతుంది . జనగణమన పూర్తయిపోగానే విజయ్ దేవరకొండ ఈ సినిమా చేయ‌నుండ‌గా, ఇందులో రాశీ ఖ‌న్నా, విజ‌య్ దేవ‌ర‌కొండ రొమాన్స్ పీక్స్‌లో ఉంటుంద‌ని స‌మాచారం.

Rashi Khanna Romans with Vijay Devarakonda

Advertisement

మరోసారి విజయ్ దేవరకొండతో బెడ్ సీన్స్ చేయడానికి రాశీ ఖ‌న్నా కూడా చాలా ఆస‌క్తిగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. రాశీ ఖన్నా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ తీసుకుంటున్న తక్కువ రెమ్యూనరేషన్‌తో పాటు ఈమె యాటిట్యూడ్ సినిమా అవకాశాలు తీసుకొచ్చి పెడుతున్నాయంటూ ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఈమె ఎప్పుడూ సహచర నటులతో, సినిమా క్రూతో కూల్‌గా ఉంటారనే మంచి టాక్‌ను మూటగట్టుకుంది.అంతేకాదు రెమ్యూనరేషన్ పరంగా కూడా తక్కువకే నటించేందుకు ఒప్పుకుంటుందట.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి