Home » Entertainment » Rashmi Gautam Fires On Dog Killed In Merut
Entertainment

Rashmi Gautam : వాళ్లు అసలు మనుషులకే పుట్టలేదు.. రష్మి గౌతమ్ ఆగ్రహం

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 27, 2022, 6:02 pm
Advertisement

Rashmi Gautam : యాంకర్ రష్మీకి మూగజీవాలంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా కుక్కలంటే మరింత మక్కువ చూపిస్తుంది. తన ఇంట్లో కూడా పెట్స్‌ను పెంచుకుంటుంది రష్మీ. రోడ్డు మీద బలహీనంగా, ధీనస్థితిలో ఉన్న పెట్స్‌ను చూసి జాలిపడుతుంటుంది. వాటిని ఇంటికి తెచ్చుకుని మరీ వైద్యం చేయించి.. పెంచుకుంటుంది రష్మీ.కుక్కల మీద ప్రతాపం చూపించే మనుషులు, కుక్కలను హాని చేస్తూ పిచ్చి పనులు చేసే వాళ్ల మీద రష్మీ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తుంటుంది.

Advertisement

మూగ జీవాలను హింసించే వారిని రష్మీ ఉపేక్షించదు. తనకు వీలైనంతలో వారికి శిక్ష పడేలా చేస్తుంది. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయమని ఆ బాధాకరమైన దృశ్యాలను షేర్ చేస్తుంటుంది.అయితే తాజాగా కొంత మంది కలిసి ఓ కుక్కను దారుణంగా కొట్టి కొట్టి చంపారు. ఇది ఉత్తరప్రదేశ్‌లో జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ వీడియో ఎంతో క్రూరంగా ఉంది. దీనిపై రష్మీ స్పందింది.

Rashmi Gautam Fires on dog Killed in merut

Advertisement

అసలువాళ్లు మనుషులేనా, వారికి జాలి దయ అనేవి ఉన్నాయా? వాళ్లు మనుషులకే పుట్టారా? అంటూ యాంకర్ రష్మీ ఆవేదన చెందింది.వారికి శిక్ష పడే వరకు ఈ వీడియోను షేర్ చేస్తూ ఉండండని కోరింది. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేశారట. అయినా కూడా రష్మీ కోపం మాత్రం చల్లారలేదు. వారికి శిక్ష పడినా కూడా దాని ప్రాణాలు మాత్రం తిరిగి రావు కదా? అని.. అలా పెంచిన తల్లిదండ్రులను రష్మీ తిట్టిపోసింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి