Rashmi Gautham Sad Video in Viral
Rashmi Gautam : యాంకర్ రష్మీకి పెట్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వీధి కుక్కలను ఇంటికి తెచ్చి మరీ పెంచుకుంటూ ఉంటుంది. ఏ వీధి కుక్క అయినా అపస్మారక స్థితిలో ఉండి, గాయాలతో బాధపడుతుంటే రష్మీ చూస్తూ ఊరుకోదు. వాటిని ఇంటికి తీసుకొచ్చి, వైద్యం చేయించి మరీ పెంచుకుంటూ ఉంటుంది. అలా ఇప్పుడు రష్మీ వద్ద చుట్కీ అనే ఓ పెట్ ఉంది.
అదంటే రష్మీకి ప్రాణం. మూగ జీవులను ఇంతగా ప్రేమించే రష్మీ అంటే కొంత మందికి అభిమానం. కానీ ఇంకొంత మంది మాత్రం రష్మీని దారుణంగా బూతులతో ట్రోల్ చేస్తుంటారు. రష్మీని నెగెటివ్ కామెంట్లతో హింసిస్తుంటారు. తాజాగా అలాంటి కొన్ని చెత్త కామెంట్లపై రష్మీ స్పందించింది. చుట్కీ అంటే ప్రాణం..దాన్ని వదిలి ఉండలేనంటూ రష్మీ ఓ పోస్ట్ చేసింది.దాని మీద నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. పచ్చి బూతులతో రష్మీ మీద దాడి చేశారు.
Anchor Rashmi Gautam Fires On Netizen Abusive Comments
కుక్కతోనే చేసుకో అంటూ అడ్డూ అదుపూ లేకుండా నీచాతి నీచమైన కామెంట్లు చేశారు. అలాంటి వాటిపై రష్మీ స్పందించింది. అందరికీ ఓ దండం పెట్టేసింది. అలా ఎలా మాట్లాడతారు.. ఎలా ఊహించుకుంటారు.. ఇలాంటి వాళ్లు ఎక్కడి నుంచి వస్తారు..నన్ను, నా పోస్ట్‌లను మీరు వ్యతిరేకించొచ్చు.. నేను మీకు నచ్చకపోవచ్చు కానీ ఇలాంటి చెత్త మాటలు ఎలా అనగలుగుతున్నారు అంటూ రష్మీ ఆవేదన చెందింది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.