Rashmi Gautam Fires on Varsha In Sridevi Drama Company Promo
Rashmi Gautam : యాంకర్‌గా రష్మీకి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూనే రష్మీ కనిపించింది. కానీ రష్మీకి ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. శ్రీదేవీ డ్రామా కంపెనీకి కూడా యాంకర్‌గా మారిపోయింది. సుధీర్ వెళ్లిపోవడంతో ఆ స్థానంలోకి రష్మీ వచ్చింది. రష్మీ బాగానే నడిపిస్తోంది. అయితే సుధీర్ లేని లోటును మాత్రం ఎవ్వరూ తీర్చలేరు. శ్రీదేవీ డ్రామా కంపెనీలో సుధీర్ లేకపోయినా కూడా పరోక్షంగా మాత్రం అతడి గురించి కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. బాబు అంటూ ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ కూడా రష్మీని ఏడిపిస్తున్నారు. సుధీర్ రష్మీ ట్రాక్‌ను పరోక్షంగా వాడేస్తున్నారు.
అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అందరూ రష్మీని కార్నర్ చేశారు. ఆషాడం కదా? భార్యభర్తలు ఒక చోట ఉండొద్దని అంటుంటారు.. ఇలానే వర్ష కౌంటర్లు వేయబోయింది. అక్కా ఆషాడం కదా? నువ్ ఇక్కడున్నావ్.. బావ అక్కడున్నాడు అంటూ రష్మీ మీద వర్ష కౌంటర్లు వేసేందుకు ప్రయత్నించింది. దీంతో రష్మీకి చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఎవరే నీకు అక్కా.. ఎవరే నీకు అక్కా.. వెళ్లి కూర్చో అంటూ రష్మీ మీద మీదకు వచ్చింది. ఆ వెంటనే ఆది అందుకున్నాడు. రష్మీ అంటూ తీయగా పిలిచాడు.. హా ఏంటి అంటూ రష్మీ కాస్త గట్టిగా అడిగింది. అందరికీ ఆషాడం నెల ఉంటే..
Rashmi Gautam Fires on Varsha In Sridevi Drama Company Promo
మీకు మాత్రం ఓ ఏడాది ఉండేలా కనిపిస్తోందంటూ ఆది పంచ్ వేస్తాడు. అంటే ఇంకో ఏడాది వరకు సుధీర్, రష్మీ కలిసి ఏ షోలోనూ కనిపించకపోవచ్చన్నమాట. ఆది ఆ ఉద్దేశ్యంతోనే డైలాగ్ వేశాడా? లేదంటే కామన్‌గానే వేశాడా? అన్నది తెలియడం లేదు. మొత్తానికి సుధీర్ ప్రస్థావన లేకపోతే మాత్రం ఆ ప్రోమో ప్రోమోలా ఉండదు.. ఎపిసోడ్ ఎపిసోడ్‌లా ఉండదని మరోసారి నిరూపించారు. ఇక యూట్యూబ్‌లో వీడియోల కింద మాత్రం వి మిస్ యూ సుధీర్ అన్నా.. నువ్ మళ్లీ ఈ షోలోకి రావాలి.. నువ్వొస్తేనే మేం చూస్తామంటూ ఇలా సుధీర్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి వచ్చే ఆదివారం మాత్రం శ్రీదేవీ డ్రామా కంపెనీ దుమ్ములేపేలా ఉంది.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.