Home » Entertainment » Rashmi Gautam Mass Steps For Bigg Boss Intlo Maa Parivaar
Entertainment

Rashmi Gautam : ఇదేం ఊపుడురో బాబోయ్.. దుమ్ములేపేసిన రష్మి గౌతమ్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: June 6, 2022 6:19 pm
Advertisement

Rashmi Gautam : రష్మి గౌతమ్ ప్రస్తుతం మల్లెమాల నుంచి డైవర్ట్ అవుతోంది. కేవలం మల్లెమాల ఈవెంట్లే కాకుండా.. స్టార్ మాలోనూ సందడి చేస్తోంది. గత కొన్ని ఈవెంట్లలో రష్మీ దుమ్ములేపేసింది. ఈటీవీ ఈవెంట్లలో కాకుండా స్టార్ మా పండుగ ఈవెంట్లలో రష్మీ సందడి చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు సుధీర్ కూడా స్టార్ మాలోకే జంప్ అయ్యాడు. కనీసం రష్మీ అయితే అప్పుడప్పుడు ఈవెంట్లలోనే కనిపించేది. కానీ సుధీర్ అయితే ఏకంగా సింగింగ్ షోకు పూర్తి స్థాయి యాంకర్‌గా వెళ్లిపోయాడు. ఆ మధ్య స్టార్ మాలో ఈ ఇద్దరూ కలిసి చేసిన హోలీ ఈవెంట్, అందులో వీరిద్దరి మ్యాజికల్ కెమిస్ట్రీ ఎంతగా వైరల్ అయింది.

Advertisement

సుధీర్‌కు రష్మీ పెట్టిన దిష్టి చుక్క, రష్మీ కోసం సుధీర్ పాడిన పాటలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా రష్మి మరోసారి స్టార్ మా కోసం దుమ్ములేపేసింది. స్టార్ మాలో ఓ కొత్త ప్రోగ్రాం రాబోతోంది. ఈ ఈవెంట్ కోసం రష్మీ తెగ ఊపేసింది. ఈ ఈవెంట్‌లో రష్మీ మాత్రమే కాకుండా శేఖర్ మాస్టర్ తన స్టైల్లో దుమ్ములేపేశాడు. బిగ్ బాస్ ఇంట్లో మా పరివార్.. వంద రోజుల హంగామా ఒకే రోజులో అంటూ ఓ ఈవెంట్ చేస్తోంది స్టార్ మా. సీరియల్ సెలెబ్రిటీలను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించేశారు. ఇక వారితో కలిసి రష్మీ, శేఖర్ మాస్టర్ వంటి వారు దుమ్ములేపబోతోన్నట్టు కనిపిస్తోంది.

Rashmi Gautam Mass Steps For BIGG BOSS INTLO MAA PARIVAAR

Advertisement

ఈ మేరకు వదిలిన ప్రోమోలో శేఖర్ మాస్టర్.. మ మ మహేషా అంటూ తాను కంపోజ్ చేసిన స్టెప్పులనే మరోసారి స్టేజ్ మీద వేశాడు. ఇక మందులోడా ఓరి మాయలోడా అంటూ రష్మీ చేత ఊపు ఊపించేశారు. రష్మీ కూడా ఓ రేంజ్‌లో తన అందాలను ఊపేసింది. ఈ మాస్ ఐటంకు రష్మీ వేసిన స్టెప్పులతో అగ్గి రాజేసేలా ఉంది. మొత్తానికి ఈ ప్రోమోతో ఈవెంట్‌ మీద మంచి హైప్ ఏర్పడింది. ఇక సుధీర్ కూడా తోడైతే మాత్రం ఓ రేంజ్‌లో ఉండేట్టు కనిపిస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి