Home » Entertainment » Rashmi Gautam Oo Antava Steps In Sakranthi Etv Event
Entertainment

Rashmi Gautam : వామ్మో ఏం తిప్పిందిరా బాబు!.. రష్మీ గౌతమ్ చేస్తే ఊ అనాల్సిందేనన్న ఆది

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 12, 2022, 2:40 pm
Advertisement

Rashmi Gautam : యాంకర్ రష్మీ బుల్లితెరపై స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె స్టెప్పులు ఐకానిక్‌గా మారిపోతాయి. రీల్స్‌లో ట్రెండ్ అవుతుంటాయి. గతంలో రష్మీ వేసిన ఓ వింత స్టెప్పులు ఓ రేంజ్‌లో ఫేమస్ అయ్యాయి. ఆ స్టెప్పులు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్ మీద ఎంతో మంది ఎక్కిరిస్తూ ఇమిటేట్ చేశారు. తాజాగా మరోసారి రష్మీ దుమ్ములేపేసింది.

Advertisement

అసలే ఇప్పుడు సమంత రాజేసిన అగ్గి ఇంకా చల్లారడం లేదు. ఊ అంటావా మామ ఊ ఊ అంటావా? అంటూ దేశం మొత్తం సమంత మంట పెట్టేసింది. అలాంటిది సమంత స్టెప్పులకు ధీటుగా ఎవ్వరూ వేయలేరని అంతా అనుకున్నారు. కానీ కొంత మంది మాత్రం సమంతను ఇమిటేట్ చేయాలని, సమంత రేంజ్‌లో దుమ్ములేపేయాలని ప్రయత్నిస్తుంటారు.

Rashmi Gautam Oo Antava Steps in Sakranthi ETV event

Advertisement

Rashmi Gautam : ఊ అంటావా అంటూ రష్మీ రచ్చ..

ఈ క్రమంలోనే అషూ రెడ్డి ఓ కవర్ సాంగ్ చేసింది. ఇక తాజాగా సంక్రాంతి ఈవెంట్ కోసం రష్మీ కూడా ఈ పాటకు స్టెప్పులు వేసింది. కళ్లతోనే మత్తు చల్లేట్టుగా రష్మీ రచ్చ చేసింది. ఆమె వేసిన స్టెప్పులు, నడుమును తిప్పిన విధానం చూస్తే అందరూ పడిపోవాల్సిందే. రష్మీ ఊ అంటే అందరూ ఊ అనాల్సిందే అంటూ హైపర్ ఆది కూడా చేతులెత్తేశాడు. రష్మీ దెబ్బకు ప్రోమో అదిరిపోయింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి