Home » Entertainment » Rashmi Gautam She Saw Sudigali Sudheer At The Pre Release Event
Entertainment

Rashmi Gautam : ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో సుధీర్ ను చూడగానే కన్నీళ్లు ఆపుకోలేక పోయిన రష్మీ గౌతమ్‌

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 3, 2022, 8:40 pm
Advertisement

Rashmi Gautam : సుడిగాలి సుదీర్, రష్మి గౌతమ్ మధ్య ఉన్నది ప్రేమనా.. స్నేహమా.. మరేమైననా కానీ అభిమానులు మాత్రం వారి యొక్క కాంబినేషన్ ను తెగ అభిమానించారు… వారిద్దరిని ప్రోత్సహించారు. వారు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ అయింది అనడంలో సందేహం లేదు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా, వారిద్దరూ కొన్ని కారణాల వల్ల కార్యక్రమాలు చేయలేక పోతున్నారు. గత కొన్ని రోజులుగా సుడిగాలి సుదీర్ ఈటీవీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యాడు. స్టార్ మా లో అతడు కార్యక్రమాలు చేస్తున్నాడు. రష్మి గౌతమ్ అక్కడికి వెళ్లినా కూడా సుడిగాలి సుధీర్ కి జోడిగా కనిపించడం లేదు.

Advertisement

సుదీర్ మరియు రష్మీ కలిసి ఒకే స్టేజిపై కనిపించక చాలా నెలలైందని చెప్పుకోవాలి. వీరిద్దరి అభిమానులు ఎప్పుడెప్పుడు మళ్ళీ వీరు కలుస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరిద్దరూ నందు హీరోగా రష్మి గౌతమ్ హీరోయిన్ గా రూపొందిన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కలిశారు. స్టేజ్ పై సుడిగాలి సుదీర్ మాట్లాడుతున్న సందర్భంగా రష్మీ గౌతమ్ కంటి నుండి ఏకధాటిగా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. నవ్వుతూ ఆమె ఏడుస్తుండడం చూసి ప్రతి ఒక్కరు కూడా సుడిగాలి సుదీర్ పై ఆమెకున్న అమితమైన అభిమానం కి ఇదే ప్రత్యేక సాక్ష్యం అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.

Rashmi Gautam she saw Sudigali Sudheer at the pre-release event

Advertisement

సుడిగాలి సుదీర్ కూడా రష్మి గౌతమ్ ని చూసి మాట్లాడలేక పోతున్నట్లుగా సిగ్గుపడుతూ సగం సగం మాట్లాడి కిందికి దిగిపోయాడు. సుదీర్ మాట్లాడుతున్న సమయంలో చాలా మంది అభిమానులు రష్మీ రష్మీ అంటూ కేకలు పెట్టడంతో ఇద్దరు కూడా సిగ్గుపడుతూ మురిసి పోయారు. ఇంతటి అభిమానం ఒకరిపై ఒకరికి ఉండటం తో మళ్ళీ వీరిద్దరు కలిసి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి కేవలం రష్మి గౌతమ్ ఆహ్వానించింది కనుకనే సుడిగాలి సుదీర్ వచ్చాడు అంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి