Rashmi Gautham In Anasuya Dispute With Vijay Devarakonda
Rashmi Gautham : సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా అనసూయ పేరు తెగ నానుతుంది. జబర్దస్త్ షోను వీడినప్పటి నుంచి ఆమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. అమ్మను అన్న ఉసురు ఊరికే పోదంటూ శాపనార్థలు పెడుతూ ఆమె చేసిన ట్వీట్‌పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విజయ్‌ని ఉద్దేశించే ఈ ట్వీట్ చేసిందని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.ఇక అప్పటి నుండి అనసూయ తగ్గకుండా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తుండగా, దీనిపై చర్చ నడుస్తూనే ఉంది. ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో అనసూయకు-విజయ్ ఫ్యాన్స్‌కు మధ్య ట్విటర్ వార్ మొదలైంది. తనని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్న ప్రతి ఫ్యాన్‌కు అనసూయ ఏమాత్రం తగ్గకుండా తనదైన స్టైల్లో వార్నింగ్ ఇస్తుంది.
రష్మీకి మద్దతు..
ఇదిలా ఉంటే అనసూయ విషయంలో రష్మి కి మద్దతు పెరుగుతుండటం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అవుతుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్సే కాదు, సాధారణ నెటిజన్లు కూడా రష్మి సపోర్ట్ గా తయారవుతున్నారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అనసూయ ఇలాంటి విషయాల్లో నోరు జారుతుందని,ఆమెకి దూకుడెక్కువని, కాంట్రవర్సీలకు అనసూయ కేరాఫ్‌గా నిలుస్తుందంటున్నారు. అదే సమయంలో యాంకర్ రష్మీ చాలా పద్దతిగా, డీసెంట్‌గా ఉంటుందని పొగడ్తలు కురిపిస్తున్నారు. ఆమెకు మద్దతుగా కూడా నిలుస్తున్నారు. తన లిమిట్స్ ఏంటో తనకు తెలుసు అని, హుందాగా వ్యవహరిస్తుందని ఆమెని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
Rashmi Gautham In Anasuya Dispute With Vijay Devarakonda
మొత్తంగా విజయ్ దేవరకొండ అభిమానులంతా రష్మి వైపు మళ్లారనే విషయం స్పష్టమవుతుంది. అయితే ఇవన్నీ చూసిన రష్మి `పండగ చేస్కోండి` అంటూ కామెంట్లు పెట్టడం విశేషం. రష్మి సైతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పంచుకుంటుంది. కానీ అనసూయ రేంజ్‌లో కొంటెపనులు చేయదని, చాలా హుందాగా వ్యవహరిస్తుందని, అందుకే రష్మిది సెపరేట్ ట్రాక్ అని అంటుంటారు. ప్రస్తుతం రష్మి `జబర్దస్త్`తోపాటు `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ`లకు హోస్ట్ గా చేస్తుంది. అనసూయ వదిలేసి `జబర్దస్త్`ని, సుధీర్ వదిలేసిన `శ్రీదేవి డ్రామా కంపెనీ`లకు తనే యాంకర్‌గా చేస్తుంది
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
This website uses cookies.