Home » Entertainment » Rashmi Gautham Sudigali Sudheer Matter Topic Now
Entertainment

Rashmi Gautam : ఈ ఒక్క దెబ్బతో సుధీర్ ని యాంకర్ రష్మి పెళ్లి చేసుకుంటుందా లేదే తేలిపోతుంది.. !

Authored By
Sam C
The Telugu News | Published on: October 21, 2022, 1:30 pm
Advertisement

Rashmi Gautam : బుల్లితెర బెస్ట్ జోడీలో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. వీరి మధ్య కెమిస్ట్రీ మామూలుగా ఉండదు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని బాగా పండిస్తారు. జబర్దస్త్‌లో వీరిద్దరు లవ్ ట్రాక్ లేకుండా ఉండదు. అంతలా ఇద్దరు హైలెట్ అయిపోయారు.ఈ వేదిక‌గా వారిద్ద‌రు పండించిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. చిన్నితెరపై ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూసి ఫిదా అయిన ఆడియన్స్ ఎంతమంది అంటే మాటల్లో చెప్పలేం. ఎవరికివారు తమ తమ టాలెంట్‌తో పాపులర్ ఆయనదాన్ని మించి జంటగా ఈ ఇద్దరూ ఫుల్ ఫేమ్ కొట్టేశారు. అయితే సుధీర్‌.. జ‌బ‌ర్ధ‌స్త్‌కి దూర‌మైన కూడా ఆయ‌న పేరు అప్పుడ‌ప్పుడు ఈ వేదిక‌పై వినిపిస్తూనే ఉంది. ఏదో ఒక సంద‌ర్భంలో ఎవ‌రో ఒక‌రు సుధీర్ పేరు తేవ‌డంతో ర‌ష్మి మెలికలు తిరుగుతూ ఉంటుంది.

Advertisement

జ‌బ‌ర్ధ‌స్త్‌ ఎపిసోడ్ కి సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్, సీనియర్ హీరోయిన్ ఖుష్బూ జడ్జీలుగా వ్యవహరించారు. కమెడియన్ల కంటే జడ్జిగా ఉన్న కృష్ణ భగవాన్ కామెడీ పంచ్ లే ఎక్కువ పేలుతున్నాయి. ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను నవ్వించేందుకు తమ ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జ‌బర్ధ‌స్త్‌కి సంబంధించి ప్రోమో విడుద‌ల కాగా, ఇందులోని పంచ్‌లు, డైలాగ్‌లు తెగ పేలాయి. ఇమ్మాన్యూల్ , వర్ష చేసిన స్కిట్ ఆకట్టుకునేలా ఉంది. జబర్దస్త్ కమెడియన్ ఒకరు రష్మీకి ప్రపోజ్ చేస్తుండగా కృష్ణ భగవాన్ అడ్డు తగులుతూ పంచ్ లు వేయడం నవ్వులు పూయిస్తోంది. ప్రోమో మొత్తం కృష్ణ భగవాన్ హైలైట్ అయితే.. చివర్లో రష్మీ మార్కులు కొట్టేసింది.

Rashmi Gautam Sudigali Sudheer matter topic now

Advertisement

Rashmi Gautam : ఎవారం మాములుగా లేదు..

టైం మెషీన్ లో వెనక్కి వెళ్లే అవకాశం ఉంటే ఎవరెవరు ఏ టైంకి వెనక్కి వెళతారు అని రష్మీ ప్రశ్నించింది. ఒక్కొక్క‌రు ఒక్కోలా స‌మాధానం ఇచ్చారు. నువ్వు ఎక్కడికి వెళతావు అని ఆటో రాంప్రసాద్ రష్మీని ప్రశ్నించగా ..నాకు తెలుసు అంటూ గెటప్ శ్రీను కల్పించుకుంటాడు. రష్మీ, సుడిగాలి సుధీర్ తొలి కలయిక గురించి శ్రీను పరోక్షంగా కామెంట్స్ చేస్తాడు. 2014 ఫిబ్రవరి 14 న వాలంటైన్స్ డే రోజున అంటూ శ్రీను హార్ట్ సింబల్ చూపిస్తుండగా రష్మీ ఒకవైపు సంతోషం, మరోవైపు సిగ్గుతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇది చూసి వీర‌ద్ద‌రి మ‌ధ్య ఎవారం ఇంకా న‌డుస్తుందా అంటూ కొంద‌రు పంచ్‌లు వేస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి