Home » Entertainment » Rashmi Interrogates Sudigali Sudheer
Entertainment

Sudigali Sudheer : గొడదూకి ఎందుకు వ‌చ్చావ్‌.. సుడిగాలి సుధీర్ ప‌రువుతీసిన ర‌ష్మీ..!

Authored By
Sam C
The Telugu News | Published on: February 12, 2022, 5:00 pm
Advertisement

Sudigali Sudheer : బుల్లితెర‌పై ఉన్న క్రేజీ జంట‌ల‌లో సుధీర్ ర‌ష్మీ జంట ఒక‌టి. వీరు క‌లిసి ఏ కార్య‌క్ర‌మం చేసిన అది సూప‌ర్ హిట్ కావల్సిందే. ఇప్ప‌టికే వీరిద్ద‌రిపై అనేక ర‌కాలుగా షోలు ప్లాన్ చేశారు. బుల్లితెరపై ఎప్పటికీ భేతాళ ప్రశ్నలా వెంటాడుతూ ఉండే టాపిక్ ఒకటి ఉంటుంది. సుధీర్ రష్మీ పెళ్లి గురించి వారి అభిమానులు ఎప్పుడూ ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు. తెరపై ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమే తాము అలా నటిస్తామని, అంతకు మించి మా మధ్యన ఎలాంటి రిలేషన్ లేదని ఎన్నో సార్లు రష్మీ, సుధీర్ క్లారిటీగా చెప్పారు.ఆన్ సెట్ మీద మా కెమిస్ట్రీ అలా ఉంటుందని,

Advertisement

ఆఫ్ స్క్రీన్‌లు అసలు మాట్లాడుకోమని, అంత క్లోజ్‌గా ఉండమని తమ బంధం గురించి ఎన్నో సార్లు చెప్పారు. అయిన‌ప్పటికీ వీరిగురించి అనేక ప్ర‌చారాలు న‌డుస్తుంటాయి.తాజాగా జరిగిన స్కిట్‌లో సుధ‌ర్ -ర‌ష్మీ క‌లిసి ప‌ర్‌ఫార్మెన్స్ చేశారు. ఇందులో డిటెక్టివ్‌గా ర‌ష్మీ న‌టించ‌గా, సుధీర్ ఓ ముద్దాయిగా క‌నిపించారు. సుధీర్‌ని ఇన్వెస్టిగేష‌న్ చేసింది ర‌ష్మీ. ఈ భాగంలో సుధీర్ ఫోన్ అడిగి పాస్వ‌ర్డ్ చెప్ప‌మంటే ఉమ్మ అని చెబుతాడు. ప‌క్క‌న ఉన్న కానిస్టేబుల్ పాస్‌వ‌ర్డ్ అడిగితే ఉమ్మా అంటావా అని ఫైర్ అవుతాడు. అయితే త‌న మొబైల్ పాస్ వ‌ర్డ్ ఉమ్మా అని అంటాడు. ఇక జీమెయిల్ పాస్‌వ‌ర్డ్ అడ‌గ‌గా, తొంద‌ర‌గా వ‌చ్చేయ్ అని చెబుతాడు.

rashmi interrogates Sudigali Sudheer

Advertisement

Sudigali Sudheer : సుధీర్ పంచ్‌లు మాములుగా లేవుగా..!

పంజాగుట్ట‌లో గోడ ఎందుకు దూకారు అని ర‌ష్మీ ప్ర‌శ్నించ‌గా, దానికి స్ట‌న్నింగ్ స‌మాధానం చెప్పాడు సుధీర్.గోడ మీద ఇచ్చ‌ట మూత్రం పోయ‌రాదు అని ఉంది.అందుకే గోడ దూకి అటు ప‌క్క‌కు వెళ్లాం.పొద్దున లేవ‌గానే ఏం చేస్తావు అని అడ‌గ‌గా, అందుకు సుధీర్ మా ఇంటికి వెళ‌తా అని అంటాడు. అందుకు ర‌ష్మీ నువ్వు మీ ఇంట్లోనే లేస్తావు అని అడ‌గ‌గా, దానికి మ‌నో సొరంగంలో ఉంటాడేమో అని పంచ్ వేస్తాడు. ఇదేంటి సార్ అన్నట్టుగా సుధీర్ చూసేస్తాడు. మొత్తానికి తనను ఎంత కించపరిచినా కూడా కామెడీ కోసం సుధీర్ అన్ని పంచ్‌లు భ‌రిస్తున్నాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ ప్రోమో ఆస‌క్తిక‌రంగా మారింది. మీరు ఈ వీడియోపై ఓ లుక్ వేయండి

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి