Home » Entertainment » Rashmika Mandanna Beautiful Looks Viral
Entertainment

Rashmika Mandanna : ర‌ష్మిక రోజురోజుకి ఇంత దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తుందేంటి.. ఇక మార‌వా?

Authored By
Sam C
The Telugu News | Published on: October 13, 2022, 4:30 pm
Advertisement

Rashmika Mandanna : ఛ‌లో చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి నేషనల్ క్రష్ గా ఎదిగింది. ఇక ఇటీవల వచ్చిన పుష్ప సినిమాతో తన కెరీర్ మలుపు తిరిగింది. ఈ మూవీతో దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ ఆమెకు బాగా ఉపయోగపడింది . ప్ర‌స్తుతం ర‌ష్మిక ఇటు బాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన తొలి హిందీ చిత్రం గుడ్ బై.

Advertisement

అక్టోబర్ 7న విడుదలైన ఈ మూవీలో రష్మిక మందన్నా యాక్టింగ్ అంతగా బాలీవుడ్ ప్రేక్షకులకు ఎక్కలేదని టాక్ వినిపిస్తోంది. గుడ్ బై మూవీ ప్రమోషన్స్ తో కొద్ది రోజుల పాటు బిజీగా ఉన్న రష్మిక మందన్నా ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతూ కుర్రాళ్ల మనసు దోచేస్తుంది. ఇటీవల స్విమ్మింగ్ పూల్ లో అందమైన లొకేషన్ లో ఫొటో దిగిన రష్మిక మందన్నా నెట్టింట రచ్చ చేసింది. ఈ భామ తాజాగా ఓ మ్యాగజైన్ కోసం బికినీలో ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ భామ తాజాగా ఓ మ్యాగజైన్ కోసం బికినీలో ఫోటోషూట్ చేసింది.

Rashmika Mandanna beautiful looks viral

Advertisement

Rashmika Mandanna : ఏం న‌డుస్తుంది..

ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ర‌ష్మిక ఏంది ఇలా మారిపోయావు అంటూ కొంద‌రు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ కలిసి మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లినట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ఎయిర్ పోర్టులో పెట్టుకున్న సన్ గ్లాసెస్, రష్మిక పూల్ పక్కన దిగినప్పుడు పెట్టుకున్న గ్లాసెస్ ఒక్కటే అని ఇంతకుముందు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అంతేకాకుండా వీళ్లిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని అనేక రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. మేము ఇద్ద‌రం ఫ్రెండ్స్ అని వీరు చెబుతున్నా కూడా ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. వీటిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి