Home » Entertainment » Rashmika Mandanna Dance For Pooja Hegde Song
Entertainment

Rashmika Mandanna : పూజా హెగ్డే సాంగ్‌కి చిందులేసిన రష్మికా మందన్న.. బాలీవుడ్ హీరోతో రచ్చ మాములుగా లేదు….!

Authored By
Sam C
The Telugu News | Updated on: March 11, 2022, 7:57 am
Advertisement

Rashmika Mandanna : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన బీస్ట్ మూవీలోని అరబిక్ కుత్తు వీడియో సాంగ్ విశేష ఆదరణ దక్కించుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేసి పాడిన ఈ   సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.ఈ సాంగ్ వీడియో ఏకంగా 150 మిలియన్ వ్యూస్ దాటేసింది.   ఇక సామాన్యుల  తో పాటు సెలెబ్రిటీలు కూడా అరబిక్ కుత్తు సాంగ్ కి స్టెప్స్ వేస్తున్నారు. ఇప్ప‌టికే స‌మంత‌, కీర్తి సురేష్‌, పూజా హెగ్డే స్టెప్పుల‌తో అల‌రించ‌గా, తాజాగా ఈ సాంగ్ కి స్టార్ హీరోయిన్ రష్మిక మందాన స్టెప్స్ వేశారు….

Advertisement

అది ఎవ‌రితోనో కాదు బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్‌తో.యువ హీరో వరుణ్ ధావన్ తో కలిసి రష్మిక అరబిక్ కుత్తు సాంగ్ కి జోష్ ఫుల్ స్టెప్స్ వేశారు ర‌ష్మిక . ఆమె మూమెంట్స్ కి తోడు గ్లామర్ తోడు కావడంతో వీడియో వైరల్ అవుతుంది. మినీ స్కర్ట్ ధరించిన రష్మిక మందాన లుక్ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. అరబిక్ కుత్తు సాంగ్ కి హీరో శివ కార్తికేయన్ సాహిత్యం అందించడం మరొక విశేషం. హిందీలో హీరోయిన్‌ రష్మికా మందన్నా క్రేజ్‌ మెల్లి మెల్లిగా పెరుగుతోంది.

Rashmika Mandanna dance for pooja hegde song

Advertisement

Rashmika Mandanna : ఇలా క్యూ క‌డుతున్నారేంటి..

ఇప్పటికే సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘మిషన్‌ మజ్ను’లో హీరోయిన్‌గా నటించింది.బాలీవుడ్‌కు రష్మిక పరిచయం కానున్న తొలి చిత్రం ఇది.   వేసవిలో విడుదల కానుంది. అలాగే అమితాబ్‌ బచ్చన్‌ లీడ్‌ రోల్‌ చేసిన ‘డాడీ’ (ప్రజెంట్‌ టైటిల్‌) చిత్రంలో రష్మిక మరో లీడ్‌   క్యారెక్టర్‌ చేశారు. తండ్రీకూతుళ్ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి వికాస్‌ బాల్‌ దర్శకుడు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది. ఇక ర‌ష్మిక న‌టించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం రీసెంట్‌గా విడుద‌ల కాగా, ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గర నిరాశ ప‌రిచింది. దీంతో ఈ అమ్మ‌డు విజ‌యాల ప‌రంప‌ర‌కి బ్రేక్ ప‌డింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి