
Rashmika Mandanna demands two crores
Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా షోలు, మీడియా ఇంటర్వ్యూలు అని తేడా లేకుండా టీవీల్లో దర్శనమిస్తోంది. సినిమా షూటింగ్ లలో ఖాళీగా ఉన్నా.. సామాజిక మాధ్యమాల్లో తన అభిమానులకు రష్మీక ఎప్పుడు టచ్ లోనే ఉంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్ చేస్తూ ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇలాగే తాజాగా రష్మీక పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.నటి రష్మీక మందన్నా… మీలో ఎవరైనా హీరోయిన్ అవ్వాలని కోరుకుంటూ ఉంటే అది మంచిదేనంటూ అయితే అందుకు మీరు ఓ పని సిద్దంగా ఉండాలని చెబుతూ భయపెట్టింది.
ఉదాహరణకు చాలా సార్లు లేజర్ చికిత్స చేయించుకోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. హీరోయిన్ అవ్వాలి అనుకుంటున్న వారు ఇది పక్కా తెలుసుకోవాల్సిన విషయమని నొక్కి చెప్పారు. లేజర్ ట్రీట్మెంట్ తో ఎంతో నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. వరుస ఆఫర్ లతో తన ఖాతా నింపుకుంటుంది. రష్మిక మందన.. ఓ వైపు టాలీవుడ్..ఓ వైపు బాలీవుడ్..మధ్యలో కోలీవుడ్ అన్నీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉంది. ప్రస్తుతం తెలుగులోనే కాక నేషనల్ వైడ్‌గా స్టార్ హీరోయిన్ గా తన సత్త చాటుతున్న భామ రష్మిక అనే చెప్పాలి.
rashmika mandanna says she can be heroine if she pays for
టాలీవుడ్ లో రోజుకో హీరోయిన్ పుట్టుకొస్తున్నా కానీ ఈ అందాల ముద్దుగుమ్మ ప్లేస్ ని మాత్రం రీప్లేస్ చేయలేకపోతున్నారు. తన క్యూట్ క్యూట్ లూక్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది రష్మిక.కన్నడలో కిరాక్ పార్టీ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రష్మీకటాలీవుడ్ లో ఛలో మూవీతో తెరంగేట్రం చేసి అనతికాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి సినిమాల్లో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని వరుస హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమా షూటింగ్ కోసం వేచి చూస్తున్న రష్మీక బాలీవుడ్ లోనూ భారీ చిత్రాలకు సైన్ చేస్తున్నట్లు సమాచారం.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.