Home » Entertainment » Rashmika Mandanna Stunning Comments
Entertainment

Rashmika Mandanna : ఆ కార‌ణంగా రాత్రి నిద్ర‌లో నుండి లేచి ఏడ్చేదాన్నంటూ రష్మిక మందన్నా స్ట‌న్నింగ్ కామెంట్స్

Authored By
Sam C
The Telugu News | Updated on: October 4, 2022, 3:31 pm
Advertisement

Rashmika Mandanna : ర‌ష్మిక‌.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ర్షించే అభిన‌యంతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తుంటుంది. మొదట కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి విజయాలను అందుకున్న రష్మిక మందన్న ఆ తర్వాత చాలా తొందరగానే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. చిన్న సినిమాల‌తో మంచి విజ‌యాలు అందుకున్న ర‌ష్మిక ఆ తర్వాత అగ్ర హీరోలతో అవకాశాలను అందుకుంది. ఫలింతంగా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌, కోలీవుడ్ అంటూ వ‌రుస సినిమాలతో నానా ర‌చ్చ చేస్తుంది.

Advertisement

ర‌ష్మిక న‌టించిన గుడ్ బై చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లోభాగంగా తెగ సంద‌డి చేస్తుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. ఇక తెలుగులోకి వ‌చ్చాక ర‌ష్మిక రేంజ్ మారింది. నేష‌న‌ల్ క్ర‌ష్‌గా ఈ అమ్మ‌డికి ఎన‌లేని గుర్తింపు ద‌క్కింది.

Rashmika Mandanna Stunning Comments

Advertisement

Rashmika Mandanna : అన్ని క‌ష్టాలా..

గీతాగోవిందం, డియ‌ర్ కామ్రేడ్ సినిమాల్లో త‌ను చేసిన లిప్ లాక్ సీన్లపై తీవ్ర‌మైన నెగిటివ్ ట్రోలింగ్ జ‌ర‌గ‌డంతో త‌ను తీవ్రంగా ఇబ్బంది ప‌డిన‌ట్టుగా ర‌ష్మిక చెబుతోంది. విమ‌ర్శ‌ల ధాటికి త‌ను రోజుల త‌ర‌బ‌డి ఒక ర‌క‌మైన డిప్రెష‌న్లో ఉన్న‌ట్టుగా చెప్పింది. రాత్రిళ్లు దిండులో మొహం పెట్టుకుని ఏడ్చేదాన్నంటూ ర‌ష్మిక వివ‌రించింది. ఆ ట్రోలింగ్ ప్ర‌భావం త‌న‌పై అలా తీవ్ర‌మైన నెగిటివిటీకి కార‌ణ‌మైంద‌ని చెప్పింది. నెమ్మదినెమ్మ‌దిగా ఆ ప్ర‌భావం నుంచి బ‌య‌ట‌పడిన‌ట్టుగా ర‌ష్మిక వివ‌రించింది. ఇప్పుడు పెద్ద‌గా ట్రోలింగ్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పూర్తి దృష్టి సినిమాల‌పైనే పెట్టాన‌ని అంటుంది ర‌ష్మిక‌. మ‌రి ఈ అమ్మ‌డు రానున్న రోజుల‌లో సెన్సేష‌న్స్ క్రియేట్ చేయ‌డం ఖాయమ‌ని కొంద‌రు అంటున్నా.

 

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి