Home » Entertainment » Regina Cassandra Comments About Men Stamina
Entertainment

Regina : అబ్బాయిల కెపాసిటీపై రెజీనా షాకింగ్ కామెంట్స్… మ్యాగీలా రెండు నిమిషాలే..!

Authored By
Sam C
The Telugu News | Updated on: September 9, 2022 3:13 pm
Advertisement

Regina : అందాల ముద్దుగుమ్మ రెజీనా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు మంచి మంచి సినిమాలు తీసిన రెజీనా ప‌రిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. ఇటీవ‌లి కాలంలో ఈ అమ్మ‌డికి పెద్ద‌గా ఆఫ‌ర్స్ రావ‌డం లేదు. అప్పుడ‌ప్పుడు ఏదో అవ‌కాశం అందిపుచ్చ‌కుంటూ ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రిస్తూ వ‌స్తుంది. దర్శకుడు రమేష్ వర్మ.. రెజీనా, నివేదా థామ‌న‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శాకిని డాకిని చిత్రాన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 16న ఈ మూవీ విడుదల కానుంది. సురేష్ బాబు డి, సునీత తాటి, థామస్ కిన్ నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు.

Advertisement

Regina : బాబోయ్ ఏందిలా..

కొద్ది రోజులుగా రెజీనా చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో యాక్టివ్‌గా ఉంటూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తుంది. తాజాగా ఆమె అబ్బాయిల‌కి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ”అబ్బాయిలు మ్యాగీ నూడిల్స్ రెండూ ఒకటే… రెండు నిమిషాల్లో ఐపోతారు” అన్నారు. ఆ జోక్ మీనింగ్ ఏమిటో మేల్ యాంకర్ కి కాసేపటి వరకు తట్టలేదు. ఆ విషయం గమనించిన రెజీనా.. నా జోక్ నీకు అర్థం కాలేదు, అని యాంకర్ తో అంది. దానికి మేల్ యాంకర్ లేదు నాకు అర్థమైంది. కానీ దాన్ని డిస్కస్ చేయవద్దు అంటూ తలపట్టుకున్నాడు. రెజీనా పరోక్షంగా అబ్బాయిల శృంగార సామర్థ్యం పై సెటైర్ వేశారని నెటిజెన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

Regina Cassandra Comments About Men Stamina

Advertisement

రెజీనా వేసిన జోక్‌కి నివేదా త‌ల ప‌ట్టుకొని కూర్చుంది. ఈ అమ్మ‌డు ఎందుకు ఇలా అయింది అంటూ కొంద‌రు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా రెజీనా ఒక్క జోక్ తో తన లేటెస్ట్ మూవీ ‘శాకిని డాకిని’కి ప్రచారం కల్పించింది. ఇప్పుడు జనాలు ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. రెజీనా ఇటీవ‌ల ఆచార్య సినిమాతో ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే. ఆచార్య మూవీలో… ‘సానా కష్టం’ అనే ఐటెం సాంగ్ లో చిరుతో స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు. ఆ మూవీ డిజాస్టర్ కాగా రెజీనా గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకోలేదు. తెలుగులో రెజీనాకు అవకాశాలు రావడం లేదు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి