Home » Entertainment » Renu Desai About Aadya Funny Video
Entertainment

Renu desai : ఆద్య కోతి చేష్టలు.. రేణూ దేశాయ్ నవ్వులే నవ్వులు

Authored By
Cinema Desk
The Telugu News | Published on: April 8, 2021, 8:59 pm
Advertisement

Renu desai : రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రేణూ దేశాయ్ తన పిల్లలిద్దరితో కలిసి ఉంటుంది. ఇప్పట్లో రేణూ దేశాయ్ రెండో పెళ్లి గురించి ఆలోచించే ఉద్దేశ్యంలో లేనట్టు కనిపిస్తోంది. రెండో పెళ్లిపై ప్రకటనలు ఇవ్వడంతో రేణూ దేశాయ్‌పై విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. అయితే అలా జనాగ్రహానికి రేణూ దేశాయ్ ఆ విషయాన్ని కాస్త పక్కన పెట్టేసింది.

Advertisement

ఇప్పుడు మాత్రం రేణూ దేశాయ్ తన పిల్లలిద్దరితో సంతోషంగా జీవితాన్ని గడిపేస్తోంది. ఆద్య, అకీరా నందన్‌లే లోకంగా బతికేస్తోంది. తన పిల్లలిద్దరి గురించి రేణూ దేశాయ్ ఎంతో గొప్పగా చెబుతుంటుంది. తన పోస్ట్‌ల్లో ఎక్కువగా ఆద్య గురించే ఉంటుంది. ఆద్య చేసే అల్లరి, ఆమెకుండే ప్రతిభ గురించి ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. తాజాగా ఆద్య చేసిన అల్లరి పనుల గురించి రేణూ దేశాయ్ చెబుతూ తెగ నవ్వేసింది.

Renu desai about Aadya Funny video

Advertisement

Renu desai : ఆద్య కోతి చేష్టలు.. రేణూ దేశాయ్ నవ్వులే నవ్వులు

కొత్తగా వచ్చిన ఓ యాప్‌పై ఆద్య మనసు పారేసుకున్నట్టుంది. వాండా అంటూ ఫేస్‌ను రకరకాలు మార్చే ఈ యాప్‌తో ఆద్య ఆడుకుంటోంది. వింత వింత డ్యాన్సులు చేస్తూ వాండా మోజులో పడిపోయింది. ఏం చేస్తున్నావ్. ఎలా ఉన్నావో చూడు అంటూ రేణూ దేశాయ్ పగలబడి నవ్వేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నేటి అకీరా నందన్ బర్త్ డే సందర్భంగా రేణూ దేశాయ్ షేర్ చేసిన పిక్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి