Home » Entertainment » Renu Desai Enjoys At Ocean
Entertainment

Renu Desai : నా ప్రేమ ఇలానే ఉంటుంది.. రేణూ దేశాయ్ వీడియో

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 4, 2021, 6:10 pm
Advertisement

Renu Desai రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎలా ఉంటారో, ఎలాంటి పోస్ట్‌లు చేస్తారో అందరికీ తెలిసిందే. సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రకృతి గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటుంది. కరోనా సమయంలో రేణూ దేశాయ్ ఎంతో మంది ఆకలిని తీర్చింది. ఎన్నో స్వచ్చంద సంస్థలతో కలిసి ఎంతో మందికి సాయం చేసింది. ఇక రేణూ దేశాయ్ ప్రస్తుతం షూటింగ్‌లకు రావడం లేదు.

Advertisement

Renu Desai Enjoys At Ocean

నా ప్రేమ ఇలానే ఉంటుంది.. రేణూ దేశాయ్ వీడియో Renu Desai

కరోనా భయంతోనే రేణూ దేశాయ్ ఇంటినుంచి బయటకు వెళ్లడం లేదట.అందుకే డ్రామా జూనియర్స్, ఇతర షోలకు తాను హాజరు కావడం లేదని రేణూ దేశాయ్ తెలిపింది. అయితే తాజాగా రేణూ దేశాయ్ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన ప్రేమ ఎలా ఉంటుందో చూపించింది. తనకు సముద్రాలంటే ఎంతో ప్రేమ అని ఈ వీడియో ద్వారా తెలుస్తుంది.

Advertisement

 

Renu Desai Enjoys At Ocean

Advertisement

ఎవరైనా చిన్న పిల్లలను బీచ్‌లు, సముద్రాలు వద్దకు తీసుకెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తారో రేణూ దేశాయ్ కూడా అలానే చిన్నపిల్లలా మారిపోయారు. సముద్రంలో చిన్న పిల్లలా గెంతులేశారు. చిన్మయి పాటకు ఈ వీడియోను ఎడిట్ చేసి ఇన్ స్టాలో షేర్ చేశారు. సముద్రాలపట్ల నా ప్రేమ ఇలానే ఉంటుందని అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి