Home » Entertainment » Renu Desai Met Pawan Kalyan
Entertainment

Renu Desai : చాలా రోజుల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌నిపించిన రేణూ దేశాయ్.. అభిమానుల ఆనందం వేరు..!

Authored By
Sam C
The Telugu News | Published on: May 24, 2022, 4:30 pm
Advertisement

Renu Desai : ఒక‌ప్పుడు ఎంతో చూడ‌ముచ్చ‌టైన జంట‌గా గుర్తింపు తెచ్చుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రేణూ దేశాయ్‌లు కొన్ని సంవ‌త్సరాల క్రితం అనివార్య కార‌ణాల వ‌ల‌న విడిపోయిన విష‌యం తెలిసిందే. ఎవ‌రి జీవితం వారిది అన్న‌ట్టుగా వారు జీవిస్తున్నారు. పిల్ల‌ల కోసం మాత్రం అప్పుడ‌ప్పుడు క‌లుస్తున్నారు. తాజాగా అకీరా నందన్‌ స్కూల్‌ గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రాడ్యూయేషన్‌ వేడుక సోమవారం ఘనంగా జరిగింది. ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ గ్రాడ్యూయేషన్‌ డే సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌, రేణుదేశాయ్‌ కలవడం విశేషం.

Advertisement

కుమారుడి స్కూల్‌ ఫంక్షన్‌కి అటెండ్‌ కావడంతో సందడి వాతావరణం నెలకొంది. వేడుకకి ఫెస్టివల్‌ కళ వచ్చింది.అకీరా నందన్‌ స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ సందర్భంగా మళ్లీ పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ ఒకే వేదికపై సందడి చేయడం, ఇద్దరు కలుసుకోవడం హైలైట్‌గా నిలిచింది. కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అకీరా నందన్‌, ఆద్య, రేణుదేశాయ్‌లతోపాటు కలిసి పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలకు పోజులివ్వగా ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. పవన్‌ ఫ్యామిలీ ఫోటో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ఇద్దరూ భార్యాభర్తలుగా విడిపోయి విడాకులు తీసుకుని దూరంగా ఉన్నా కూడా..

renu desai met pawan kalyan

Advertisement

Renu Desai : క‌నుల పండుగ‌గా..

పిల్లల కోసం మాత్రం తమ తమ పట్టింపులను పక్కన పెట్టేసినట్టు కనిపిస్తుంది.అకీరా నందన్, ఆద్యలను మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ కలుస్తుంటాడు. ఆ మధ్య రేణూ దేశాయ్ ఇంట్లో పవన్ కళ్యాణ్ తన పిల్లలతో ఉన్న ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అకీరా త్వ‌ర‌లోనే టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఆరంగేట్రం చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. దీనికి సంబంధించి ఎన్ని వార్త‌లు వ‌చ్చిన కూడా రేణూ దేశాయ్ దానిని ఖండిస్తూనే ఉంది.ఇక ప‌వ‌న్ ప్ర‌స్తుతం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాతో పాటు ప‌లు మూవీస్ తో బిజీగా ఉన్నాడు. ఆయ‌న సినిమాల‌పై అభిమానుల‌లో అంచ‌నాలు పీక్స్‌లో ఉన్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి