Renu Desai : పవన్ కళ్యాణ్ కూతురిని ఏడ్పించిన మీమర్స్.. బాధ తట్టుకోలేక రేణూ దేశాయ్ ఫైర్..!
Renu Desai : సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ నెటిజన్లతో ఓ మినీ యుద్దమే చేస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రేణూ దేశాయ్‌ని నెటిజన్స్ ట్రోల్ చేయడం, వారికి ఆమె గట్టిగా వార్నింగ్ ఇస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్‌ను వదిలేసి తప్పు చేశావ్ అంటూ.. మళ్లీ ఆయన దగ్గరికే వెళ్లొచ్చు కదా? అంటూ ఇలా ఉచిత సలహాలు ఇస్తుంటారు. గత వారం రోజులుగా ఇలాంటి సలహాలు వస్తూనే ఉన్నాయి. వాటిపై రేణూ దేశాయ్ తన అభిప్రాయాన్ని చెబుతూనే వస్తున్నారు. తానేమీ విడాకులు అడగలేదని, తానేమీ విడిపోవాలని కోరుకోలేదంటూ.. ఆయనే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారంటూ ఇలా నెటిజన్ల కామెంట్లకు రిప్లైలు ఇస్తూనే వస్తున్నారు. అకిరా నందన్ మీద ఇన్నాళ్లు ఎవరు నెగెటివ్ కామెంట్ చేయలేదు.
అయితే అకిరా టాలెంట్ గురించి అందరికీ చూపిస్తూ.. అతని సోషల్ మీడియా అకౌంట్లో వీడియో పోస్ట్ చేయగా, దానికి నెగెటివ్ కామెంట్స్ చేశారు. దాంతో రేణూ దేశాయ్‌కి మండిపోయింది. తన కొడుకుని ఇలా అనే సరికి ఆగ్రహం కట్టలు తెంచుకుని వచ్చేసింది. సదరు నెటిజన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చి చీవాట్లు పెట్టేశారు. పిల్లల జోలికొస్తే తల్లి చూస్తూ ఊరుకోదు అంతం చేస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చేశారు. నీ అమ్మ ఇలానే పెంచిందా?.. ఓ పిల్లాడు కెరీర్ ప్రారంభించక ముందే ఇలా మాట్లాడుతావా? అంటూ ఫైర్ అయింది. ఇక పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవాతో అకీరా, ఆద్య కలిసి తీసుకున్న ఫ్యామిలీ పిక్‌ను షేర్ చేస్తూ రేణూపై మీమ్స్ క్రియేట్ చేశారు.
Renu Desai : పవన్ కళ్యాణ్ కూతురిని ఏడ్పించిన మీమర్స్.. బాధ తట్టుకోలేక రేణూ దేశాయ్ ఫైర్..!
వారు చేసిన మీమ్స్ వలన తన కూతురు ఎంతో ఏడ్చిందంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. మీకు కుటుంబాలు లేవా అంటూ వారిని ప్రశ్నించారు. అసలు మీకు ఎమోషన్స్ లేవా? ఈ ఫొటోను నేను క్రాప్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ జోకులు వేస్తూ ఇష్టమొచ్చినట్లుగా మీమ్స్ క్రియేట్ చేస్తారా? తన తల్లి గురించి జోకులు వేస్తూ పెట్టిన ఓ పోస్ట్ చూసి నా కూతురు ఆద్య ఏడ్చింది. మీకు కూడా అమ్మ, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారు కదా. నిజంగా మనషులు ఇంతలా జంతువుల్లా ఎలా మారిపోతున్నారో అర్థం కావడం లేదు. కేవలం మీ చేతిలో ఇంటర్నెట్ ఉంది కదా అని.. సోషల్ మీడియాలో సెలబ్రెటీల గురించి ఏమైనా పోస్ట్ చేస్తారా?” అంటూ రేణూ దేశాయ్ ఫైర్ అయ్యారు. ఈ పోస్ట్ పెట్టే ముందు ఒక 100 సార్లు నేను ఆలోచించాను. కానీ నా కూతురు పడిన బాధ చూసి పెట్టకుండా ఉండలేకపోయాను అని రేణూ స్పష్టం చేసింది.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.