Home » Entertainment » Renu Desai Shares Akira Nandan Pic At Kashi
Entertainment

Renu Desai: ఇలా అకీరాను చూస్తే ఎవ్వరైనా ఆగుతారా?.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 22, 2021, 9:35 am
Advertisement

Renu Desai: రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. రేణూ దేశాయ్ మామూలుగా తనగురించి కంటే ఎక్కువగా పిల్లల గురించే చెబుతూ ఉంటుంది. ఆద్య, అకీరా అంటూ వారికి సంబంధించిన విశేషాలన అభిమానులతో పంచుకుంటుంది. మరీ ముఖ్యంగా ఎక్కువగా ఆద్య గురించే చెబుతూ ఉంటుంది. అకీరా గురించి ఎప్పుడో సమయం సందర్భం చూసుకుని అలా అలా పెడుతూ ఉంటుంది.

Advertisement

Renu Desai shares Akira nandan Pic At Kashi

అకీరా నందన్ ఎక్కువగా మాట్లాడడు అని ఇంట్రోవర్ట్ అని అందుకే ఎక్కువగా ఫోటోల్లో కనిపించడని చెబుతూ ఉంటుంది. అకీరాకు ఫోటోలు దిగడమంటే కూడా ఇష్టముండదని చెబుతూ ఉంటుంది. అకీరాకు మంచి మ్యూజిక్ సెన్స్ ఉందని మాత్రంచెబుతూ ఉంటుంది. అకీరా పియానో ప్లే చేస్తూ ఉన్నప్పుడు, పాటలు వింటూ ఉన్న సమయంలోనూ ఫోటోలను తీస్తూ వాటిని అభిమానులకు చూపిస్తుంది.

Advertisement

రెండ్రోజుల క్రితం అకీరా కనుపాపను షేర్ చేసింది. అది బాగా వైరల్ అయింది. తాజాగా కాశీలో ఉన్న రేణూ దేశాయ్ మరో ఫోటోను షేర్ చేసింది. ఇందులో అకీరా గంగాతీరంలో పడవ మీద నిల్చున్నాడు. సూర్యాస్తమయం అవుతున్న సమయంలో తీసిన ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఇలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మాత్రం రేణూ దేశాయ్ స్పెషల్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. అలా షాడోలో లైట్‌గా కనిపిస్తున్న అకీరాను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి