Renu Desai Shares Akira Nandan Pics And ABout Plastic usage Environment
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది..ఎప్పుడు మాయం అవుతుందో చెప్పడం కష్టం. కరోనా సమయంలో కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది. మధ్యలో బిజీగా మారింది. కొన్ని సార్లు మొత్తానికే కనిపించకుండా పోయింది. అలా రేణూ దేశాయ్ మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటుంది. రేణూ దేశాయ్ షేర్ చేసే ఫోటోలన్నీ వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే అందులో అకీరా నందన్ ఉంటాడు కాబట్టి. ఇక మొన్నా మధ్య షేర్ చేసిన పిక్ మాత్రం ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అయింది. అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు.
అలా పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్, ఆద్య, అకీరా నందన్ కలిసి కనిపించిన ఫోటో అందరినీ ఆశ్చర్యపరించింది. అకీరా నందన్ గురించి, అతడి గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వడం గురించి రేణూ దేశాయ్ పోస్ట్ చేసింది. ఇక ఆ కార్యక్రమంలో అకీరా నందన్ ఇచ్చిన స్పీచు, తన ఫ్రెండ్స్ కోసం ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాటను.. పియానో మీద ప్లే చేసి ఆడిటోరియంను దద్దరిల్లేలా చేసేశాడు. మొత్తానికి అకీరా నందన్ మాత్రం ఆ రోజు హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి అకీరా నందన్ హాట్ టాపిక్ అయ్యాడు. తాజాగా రేణూ దేశాయ్ ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో అచ్చం పవన్ కళ్యాణ్‌లానే కనిపించాడు. ఆ బొట్టు పెట్టుకున్నవిధానం, ఆ చూపులు అన్నీ కూడా పవన్ కళ్యాణ్‌ని గుర్తుకు చేస్తున్నాయి. మొత్తానికి అకీరా మాత్రం అభిమానులను ఇలా అలరిస్తున్నాడు.
Renu Desai Shares Akira Nandan Pics And ABout Plastic usage Environment
జూనియర్ పవర్ స్టార్ అనే ట్యాగ్‌ను ఇప్పుడే సంపాదించేసుకున్నాడు. ఇక అకీరా ఎంట్రీ గనుక అయితే సిల్వర్ స్క్రీన్ మాత్రం ఓ రేంజ్‌లో సంబరాలు చేసుకునేలా ఉంది. ఇక రేణూ దేశాయ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కొబ్బరి బొండం నీళ్లు తాగడానికి ఇదే మంచి పద్దతి.. స్ట్రాలు, ప్లాస్టిక్ గ్లాస్ వద్దు. ప్రకృతికి నష్టం కలిగించొద్దు. ఇషా ఫౌండేషన్ నుంచి కోయంబత్తూర్ ఎయిర్ పోర్టుకు వస్తుండగా దారి మధ్యలో ఈమె కొబ్బరి బోండాలు అమ్ముతూ కనిపించింది. ఆమెను ఓ ఫోటో తీసుకోవచ్చా? అని అడిగాను. దానికి ఎంతో సంతోషపడింది. సంతోషంగా ఉండేందుకు మనకు ఎక్కువ డబ్బేమీ ఉండాల్సిన అవసరం లేదని ఆమెను చూస్తే నాకు అనిపించింది..అంటూ రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ మీద లైకుల వర్షం కురుస్తోంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.