Renu Desai : పవన్ కళ్యాణ్‌పై రేణూ దేశాయ్ ప్రేమ ఇంకా చావలేదా.. 21 ఏళ్ల వయస్సులో ఆయన కోసం..!
Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ విడిపోయి దాదాపు 12 ఏళ్ళు అవుతోంది. ఇప్పటికీ వీరిద్దరు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఎవరకి వారు విడిగా బ్రతుకుతున్నా.. వారిగురించి మాత్రం ఎప్పటికప్పుడు రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. రేణూ దేశాయ్ విషయానికి వస్తే.. 2000లో నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన రేణూదేశాయ్. బద్రి సినిమాతో పవర్ స్టార్ జతగా నటించి.. ఆయనతో ప్రేమలో పడ్డారు. ఇక ఈ సినిమా నుంచే వీరు సహజీవనం చేశారంటూ.. ఇండస్ట్రీలో టాక్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ని ప్రేమించిందో అప్పుడే .. రేణూ దేశాయ్.. ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు.
ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. పవన్ కల్యాణ్‌తో విడాకులు తర్వాత రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించారు. పుణేకు చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె రెండో వివాహం చేసుకోవాలని భావించింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా రేణు దేశాయ్ విడుదల చేశారు. అయితే పవన్ కల్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతూ ఆమెను వేధించారు. ఈ విషయంలో రేణు దేశాయ్ సైతం పవన్ అభిమానులకు కౌంటరిచ్చారు. అయితే మరో రెండేళ్లలలో తాను పెళ్లి చేసుకోవడం ఖాయం అని అంటుంది రేణూ
Renu Desai : పవన్ కళ్యాణ్‌పై రేణూ దేశాయ్ ప్రేమ ఇంకా చావలేదా.. 21 ఏళ్ల వయస్సులో ఆయన కోసం..!
ఇక ఇదిలా ఉంటే తాజాగా పవన్ కల్యాణ్ సాంగ్‌కు సంబంధించి ఓ పోస్ట్ చేశారామె. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రానికి ఆమె ఎడిటర్‌గా పని చేశారు. తాజాగా దీనికి సంబంధించిన విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఖుషి’ సినిమాలోని ‘ఏ మేరా జహా’ అనే సాంగ్ క్లిప్ని పోస్ట్ చేశారు. ఈ సాంగ్ కి ఎడిటర్ రేణు దేశాయ్‌గా పని చేశారు. ఈ సాంగ్ గురించి రేణు దేశాయ్ చెబుతూ.. ఇది నేను ఫస్ట్ టైం 21 ఏళ్ళ వయసులో ఎడిట్ చేసిన పాట. ఈ పాటలో ప్రతి ప్రేము నాకు గుర్తుంది అని రేణు దేశాయ్ పేర్కొంది. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ గురించి రేణు దేశాయ్ ఇటీవల కాలంలో తరుచూ మాట్లాడుతున్నారు.దీంతో అభిమానులు రేణు దేశాయ్ పవన్ కల్యాణ్‌ను మర్చిపోలేకపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. .పవన్ కల్యాణ్‌తో కలిసి రేణు దేశాయ్ బద్రి, జానీ సినిమాల్లో నటించింది.
Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
This website uses cookies.