Renu Desai : రేణూ దేశాయ్ కోరిక తీర్చిన ఉపాసన.. ఎంత మంచి మనస్సో అంటూ ప్రశంసలు
Renu Desai : రేణూ దేశాయ్ మల్టీ టాలెంటెడ్. ఆమె ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ కాగా, ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ తో కలిసి బద్రి, జానీ సినిమాలు చేసింది ఆ సమయంలో అతనిని ప్రేమించి పెళ్లాడింది. అయితే కొన్నాళ్లకి విబేధాల వలన వారిద్దరు విడిపోయారు. ప్రస్తుతం తన పిల్లల ఇద్దరి బాగోగులు చూసుకుంటూ సంతోషంగా జీవితం గడుపుతుంది రేణు దేశాయ్. ఈమె సినిమాలకు దూరంగా ఉన్నా కూడా నిత్యం వార్తల్లో ఉంటారు. సమాజంలో జరిగే అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు.. తాజాగా ఈమె సోషల్ మీడియాలో ఓ వీడియోను సోషల్ మీడియా చేశారు. ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో రేణు దేశాయ్ ఒక ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశారు.
ఆ వీడియోపై తాజాగా మెగా కోడలు ఉపాసన స్పందించింది. అంతేకాదు ఎవరు ఊహించని సాయం చేసింది. ఆ సాయం ఏంటి? ఉపాసన రేణు దేశాయ్ కు సాయం చేయడం పై మెగా ఫ్యాన్స్ ఎలా స్పందించారో చూద్దాం..నటి రేణూ దేశాయ్ మూగ జీవాల సంరక్షణ కోసం రీసెంట్గా ఎన్జీవో ప్రారంభించారు. ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ పేరుతో ఈ సంస్థ అనే పేరును పెట్టారు. దీంతో ఎన్నో ఏళ్ల తన కల నెరవేరిందని పేర్కొంటూ శనివారం సోషల్ మీడియాలోనూ ఆమె పోస్ట్ షేర్ చేశారు. ఇక ఈ సంస్థకు ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని ఆమె పేర్కొన్నారు.
Renu Desai : రేణూ దేశాయ్ కోరిక తీర్చిన ఉపాసన.. ఎంత మంచి మనస్సో అంటూ ప్రశంసలు
ఈ నేపథ్యంలో తను ఓ అంబులెన్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ అంబులెన్స్ కొనుగోలు చేయడంలో హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన తన వంతు సాయం చేశారు. చరణ్ పెంపుడు శునకం ‘రైమీ’ పేరుతో విరాళం అందించారు. ఈ విషయాన్ని రేణూ దేశాయ్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘అంబులెన్స్ కొనుగోలుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు. దీనికి ఉపాసన కొణిదెల అకౌంట్ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉపాసన ‘గోల్డెన్ హార్ట్’ అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కాగా, రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత పిల్లలు అకీరా నందన్, ఆద్యాలే ప్రపంచంగా బతుకుతున్నారు. అకీరాను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని తెర వెనుక ప్రయత్నాలు జరుగుతుండగా.. రేణూదే తుది నిర్ణయమని ఫిలింనగర్ టాక్.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.