Bigg boss 5 : వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్. దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే మూడు భాషల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కొంతమందికి పెద్దగా క్రేజ్ లేనివాళ్ళని తీసుకొచ్చి వారికి క్రేజ్ వచ్చేలా చేస్తోంది బిగ్ బాస్ షో. హిందీలో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. అక్కడ కూడా విపరీతమైన కాంట్రవర్సీలు..నానా రచ్చలతో ప్రతీ సీజన్ సాగుతోంది. ఎన్ని కాంట్రవర్సీలు అయినా హిందీ, తెలుగు, తమిళంలో మాత్రం నిర్వాహకులు ప్రతీసారీ కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
కరోనా సమయంలో కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ కి బ్రేక్ ఇవ్వకుండా వినోదాన్ని అందించారు. బిగ్ బాస్ అంటేనే రూమర్స్, కాంట్రవర్సీలు, గొడవలు ఆరోపణలు. ఇందులో ఏదీ అబద్దం కాదు. ప్రేక్షకులకి దీని గురించి తెలుసు. పేరుకే రియాలిటీ షో అయినా అదంతా అక్కడవారు ఎలా చెప్తే అలా జరుగుతుంది..హౌజ్ మెట్స్ అలాగే చేస్తారు అని. అయినా ఆ సమయానికి అందరూ టీవీలకి అతుక్కుపోతారు. అంతగా ప్రభావం చూపించింది బిగ్ బాస్. ఇక ఈఏడాది కూడా బిగ్ బాస్ సీజన్ 5 మొదలు పెట్టేందుకు స్టార్ మా నిర్వాహకులు హౌజ్ ని సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టిసిపెంట్స్ సెలక్షన్ కూడా జరుగుతోంది.
ఇప్పటికే కొందరి పేర్లు ప్రచారంలో నిలుస్తున్నాయి. ఈసారి బాగా ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్నవాళ్ళని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మని బిగ్ బాస్ 5కి తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దాదాపు 80 నుంచి 90 రోజులు ఈయన హౌజ్ లో కుదురుగా ఉండగలడా అనేదే సందేహం. అయితే ఆయన చుట్టూ అందరూ అమ్మాయిలే కంటెస్టెంట్స్ గా ఉండాలట. అలా అయితే బిగ్ బాస్ 5 కి వస్తానని అంటున్నాడు వర్మ. ఇది ఒకరకంగా బిగ్ బాస్ 5కి బాగా కలిసి వచ్చే అతిపెద్ద అంశం. మరి నిర్వాహకులు ఆర్జీవీని తీసుకు వస్తారా..ఆయన డిమాండ్ చేసినట్టు అందరూ అమ్మాయిలనే సెలెక్ట్ చేస్తారా చూడాలి. ఇక గత సీజన్ లో పాల్గొన్న అరియానా ఆర్జీవీ వల్లే బిగ్ బాస్ లో అడుగుపెట్టింది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.