Home » Entertainment » Rishi Brings Vasudhara To His Hom In Guppedantha Manasu
Entertainment

Guppedantha Manasu : దేవయానిపై జగతికి అనుమానం.. వసుధరాను ఇంట్లోకి తీసుకొచ్చిన రిషి.. దేవయాని మరో ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Authored By
Varun G
The Telugu News | Updated on: September 11, 2022, 9:39 am
Advertisement

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 12 సెప్టెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 553 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు.. రిషిని ఒప్పించమని నీకు ఎవరు చెప్పారు అని వసుధరను అడుగుతాడు మహీంద్రా. దీంతో దేవయాని మేడమ్ చెప్పమన్నారు అని అంటుంది వసుధర. దీంతో మహీంద్రా, జగతి షాక్ అవుతారు. దేవయాని ఎందుకు మా పెళ్లి రోజును ఇంట్లో చేయాలని అనుకుంది. రిషిని ఎందుకు ఒప్పించాలనుకుంది అని డౌట్ పడుతుంది జగతి. మహీంద్రా కూడా అదే అనుకుంటాడు. ఆ తర్వాత రిషి అక్కడికి వస్తాడు. ఆ తర్వాత మహీంద్రా, జగతి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అనంతరం వసును తీసుకొని రిషి తన ఇంటికి వస్తాడు.

Advertisement

rishi brings vasudhara to his hom in guppedantha manasu

ఇంటి దగ్గర వసును చూసి దేవయాని.. ప్రేమతో మాట్లాడినట్టు నటిస్తుంది. ఎలా ఉన్నావు వసుధార. ఇప్పటికే నువ్వు చాలా విజయాలు సాధించావు. పరీక్షలు బాగా రాశావా అని అడుగుతుంది. ఇంతలో రిషి వచ్చి పెద్దమ్మ.. వసుధారను నేనే తీసుకొచ్చాను. ఫంక్షన్ కు తోడుంటుంది అని తీసుకొచ్చా అంటాడు. అవును అవును.. నాకు కూడా అదే అనిపించింది. కానీ.. పరీక్షలు మొన్ననే అయిపోయాయి కదా అని అంటుంది దేవయాని. తన మాటలు విని జగతి కూడా షాక్ అవుతుంది. రిషి మాత్రం చాలా సంతోషిస్తాడు.

Advertisement

Guppedantha Manasu : అందరితో కలిసి భోజనం చేసిన వసుధార

వదిన విషయంలో నాకేదో తేడా కొడుతోంది. రిషి.. ఎప్పుడు వదిన అసలు స్వరూపం అర్థం చేసుకుంటాడో అని అనుకుంటాడు మహీంద్రా. ఆ తర్వాత భోజనం ఏర్పాట్లు చూడమని జగతితో అంటుంది. మరోవైపు మహీంద్రా, జగతి పెళ్లి రోజు కోసం ఏం వస్తువులు తీసుకురావాలా అని ఆలోచిస్తుంటాడు గౌతమ్.

ఇంతలో అక్కడికి మహీంద్రా వస్తాడు. రిషిని అర్థం చేసుకోవడంలో నేను ఫెయిల్ అయ్యాను. నా మనసు తెలుసుకొని నా ఆనందం కోసం మా మ్యారేజ్ ఫంక్షన్ ను ఇంట్లో చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. హీరోనయ్యా నా కొడుకు అని అంటాడు మహీంద్రా.

Advertisement

ఇంతలో వసుధర వస్తుంది అక్కడికి. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ డే అంటుంది వసుధార. థాంక్యూ అంటుంది వసుధార. గౌతమ్ ఇందాక నువ్వు అన్నది కరెక్టేనయ్యా.. మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కొందరిని. జగతి నీకు అర్థం అయిందా అంటాడు మహీంద్రా. దీంతో అర్థం అయింది అంటుంది. వసుధారకు మాత్రం ఏం అర్థం కాదు.

తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. ఫంక్షన్ కోసం జగతి, ధరణి, గౌతమ్ తో కలిసి వసుధార పూలు అల్లుతూ ఉంటుంది. ఇంతలో రిషి, మహీంద్రా ఇద్దరూ కిందికి వస్తారు. రిషి వసును చూస్తాడు. ఇంతలో మీరు కూడా పూలు అల్లండి అని అంటుంది జగతి. దీంతో మేము కూడా అన్ని రంగాల్లో ముందుంటాం అని అంటాడు మహీంద్రా. రిషి, నేను ఇద్దరం ఇప్పుడు పూలు అల్లుతాం అని అంటాడు మహీంద్రా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి