Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. గుప్పెడంత మనసు సీరియల్ 28 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 619 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫణీంద్రాకు ఇన్ఫామ్ చేశా అని గౌతమ్ మహీంద్రాకు చెబుతాడు. దీంతో థాంక్స్ గౌతమ్.. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నావు అంటాడు. అలాగే తాము గౌతమ్ ఫ్లాట్ లో ఉన్న విషయం రిషికి తెలియనీయకు అంటాడు మహీంద్రా. దీంతో సరే అంటాడు గౌతమ్. మరోవైపు మీ అబ్బాయే మీకు రక్తం ఇస్తున్నాడు. కొడుకుగా అది తన బాధ్యత. నేను మిమ్మల్ని కలపడం ఏంటి. మీ రక్తబంధమే కలిపింది అని అనుకుంటుంది వసుధార. ఆ తర్వాత ఐసీయూ నుంచి బయటికి వెళ్తుంది.
ఇంతలో గౌతమ్.. మహీంద్రాకు చాయ్ తెచ్చి ఇస్తాడు. ఇంతలో వసుధార వచ్చి ఫణీంద్రా సార్ ఫోన్ చేశారు. మేడమ్ కండిషన్ గురించి అడిగారు. వస్తున్నా అని చెప్పారు అని మహీంద్రాకు చెబుతుంది. దీంతో దేవయాని వదిన ఈ విషయంలో కూడా తను ఏదో ఒకటి అంటుంది. మీరు తొందరపడకండి అంటాడు. అయినా రిషి నాకొడుకు. రిషికి నేను క్షమాపణలు చెప్పుకుంటాను. ఇంకా ఎవరి గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. ఇంకెప్పుడూ రిషిని వదిలి వెళ్లను అని చెబుతాడు మహీంద్రా. రా అమ్మ కూర్చో అంటాడు మహీంద్రా. దీంతో వెళ్లి కూర్చొంటుంది. థాంక్యూ వసుధార. మేము లేని సమయంలో రిషిని కంటికి రెప్పలా చూసుకున్నావట అంటాడు మహీంద్రా. దీంతో అతడు నా బాధ్యత అంటుంది వసుధార.
నీ గొప్పదనం నాకు తెలుసు అమ్మ. రిషి ఏం అంటున్నాడు అంటే.. తల్లి రుణం తీర్చుకుంటున్నాడు సార్ అంటుంది వసుధార. మరోవైపు జగతికి బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు. రిషి అక్కడే కాసేపు పడుకొని ఉంటాడు.
రిషి కాసేపు అక్కడే పడుకొని లేచి జగతిని చూసి అక్కడి నుంచి వెళ్లేందుకు చూస్తాడు. తను ఇంతలో తన చేయి పట్టుకుంటుంది. రిషి రిషి అని కలవరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దాహం అని అంటుంది. దీంతో తనకు వాటర్ తాగిస్తాడు రిషి.
మరోవైపు జగతికి ఏం కాదు అని రిషి భరోసా ఇస్తాడు. జగతికి ఇచ్చిన భరోసాకు జగతికి కూడా సంతోషం వేస్తుంది. బయటి నుంచి మహీంద్రా ఇదంతా చూసి సంతోషిస్తాడు. ఆ తర్వాత రిషి బయటికి వస్తాడు.
రిషిని చూసి చాలా గర్వపడతాడు మహీంద్రా. తనను హత్తుకుంటాడు మహీంద్రా. మీరు ఎక్కడికి వెళ్లారో.. ఎందుకు వెళ్లారో నాకేం చెప్పకండి. మీరు వచ్చేశారు కదా. అది నాకు చాలు అంటాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.